రియో ఒలింపిక్స్‌లో అత్యంత అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పోటీలో ఒకరికే దక్కాల్సిన పతకాన్ని ఇద్దరు క్రీడాకారులకు అందించి అరుదైన సంఘటనకు అధికారులు తెరతీసారు. అదేంటి తొలి స్థానంలో నిలిచిన ఒక్కరినే కదా విజయం వరించేది. అయితే ఇద్దరు ప్లేయర్స్ కు స్వర్ణాలు ఇవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా... మీరే కాదు ప్రత్యక్షంగా రియోలో ఈ ఈవెంట్ చూసిన వారు ఇంతకంటే ఎక్కువ షాకయ్యారు. అసలు ఈ సంఘటనకు దారితీసిన కారణాలు ఏంటో తెలుసుకోవాలని వుందా..?
మహిళల స్విమ్మింగ్ 100 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లో అమెరికా స్విమ్మర్ సిమోన్ మాన్యుయెల్, కెనడా స్విమ్మర్ పెన్నీ ఒలెక్సియాక్ స్వర్ణ పతకాలు సాధించారు. ఇద్దరు మహిళా స్మిమ్మర్లు సరిగ్గా 52.70 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నారు. దీంతో అధికారులు ఒకటికి రెండుసార్లు రీప్లే చూసి ఇద్దరినీ విజేతలుగా ప్రకటించేశారు. గతంలో ఉన్న రికార్డును వీరు బద్దలు కొట్టడంతో ఈ స్విమ్మర్లు సరికొత్త రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు.
మూడో స్థానంలో నిలిచిన స్వీడన్ స్విమ్మర్ సారాకు కాంస్యంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్ చరిత్రలో స్విమ్మింగ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి నల్లజాతి మహిళగా సిమోన్ మాన్యుయెల్ నిలిచింది. వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి ఆఫ్రో-ఆమెరికన్ గానూ మరో రికార్డు అమెరికన్ స్విమ్మర్ నమోదు చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more