భారతీయుల ఆకాంక్ష ఫలించలేదు. ఆ దైవం కూడా కరుణించలేదు. రియో ఒలింపిక్స్‌లో మరోసారి మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఫైనల్ సమరంలో భారత షట్లర్, తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైనా.. తుదిమెట్టుపై స్వర్ణం చేజారినా.. రజతపతకంతో మెరిసింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ సమరంలో సింధు పోరాడి ఓడిపోయింది. గంటకుపైగా హోరాహోరీగా సాగిన పోరులో 21-19, 12-21, 15-21 స్కోరుతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్ చేతిలో ఓటమి చవిచూసింది. కాగా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజతం సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు రికార్డు నెలకొల్పింది.
తొలి గేమ్ ఆద్యంతం హోరాహోరీగా, ఉత్కంఠగా సాగింది. ఆరంభంలో మారిన్ దూసుకెళ్లగా, సింధు వెనుకబడింది. ఓ దశలో మారిన్ 12-6తో ముందంజ వేసింది. ఈ సమయంలో సింధు విజృంభించి వరుసగా మూడు పాయింట్లు సాధించింది. తర్వాత ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. మారిన్ కాసేపు ఆధిక్యతను కొనసాగించినా, సింధు పోరాటపటిమతో ఆమెను నిలువరించింది. సింధు స్కోరును 19-19తో సమంచేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. సింధు ప్లేస్మెంట్లు, స్మాష్‌లతో అదరగొట్టింది.
రెండో గేమ్‌లో మారిన్ చెలరేగగా, సింధు జోరు తగ్గింది. ఆరంభంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి ఆధిక్యం ప్రదర్శించింది. తర్వాత సింధు, మారిన్‌కు చెరో రెండు పాయింట్లు వచ్చాయి. కాగా మారిన్ వరుసగా 5 పాయింట్లు సాధించి 11-2 స్కోరుతో ముందంజ వేసింది. ఈ దశలో సింధు కాస్త జోరు పెంచడంతో స్కోరు 7-14కు చేరుకుంది. ఆనక మారిన్‌ను నిలువరించడంలో సింధు విఫలమైంది. స్పెయిన్ షట్లర్ అదే జోరు కొనసాగిస్తూ గేమ్‌ను సొంతం చేసుకుంది. దీంతో మ్యాచ్ 1-1 గేమ్స్‌తో సమమైంది.
నిర్ణాయాత్మక మూడో గేమ్ ఆరంభంలోనూ మారిన్ దూకుడు ప్రదర్శించింది. వరుసగా రెండు పాయింట్లు గెలిచి ముందంజ వేసింది. ఆ తర్వాత సింధుకు ఓ పాయింట్ రాగా, మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 6-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో సింధు పుంజుకుని వరుసగా రెండు పాయింట్లు గెలిచి మారిన్‌ను జోరును అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. మారిన్ ఆధిక్యాన్ని 9-8కి తగ్గించిన సింధు స్కోరును 10-10తో సమం చేసింది. దీంతో ఫలితంపై ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. కాగా ఈ సమయంలో మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి ముందంజ వేసింది. తర్వాత మారిన్‌ను నిలువరించేందుకు సింధు శ్రమించినా ఫలితం లేకపోయింది. మారిన్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more