దేశం నుంచి ప్రాతినిథ్యం వహించిన మహామహా క్రీడాకారులను తోసిరాజుతూ.. రియో ఒలింపిక్స్ లో వెండి పతకంతో మెరిసిన బాడ్మీంటన్ బంగారుకొండ పీవీ సింధు తన భవిష్యత్ ను స్వర్ణంమయం చేసుకుంటుంది. తాను నమ్ముకున్న క్రీడలో బాగా రాణించడంతో అమె ప్రతిభకు కొలమానంగా అమెపై కాసుల పంట కురుస్తుంది. ‘సిల్వర్’ సింధు రూ. 50 కోట్లు విలువ చేసే గోల్డెన్ డీల్ పై సంతకాలు చేసినట్టు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. వ్యాపార సంస్థలతో ఇంత పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్న క్రికెటేతర ప్లేయర్ గా సింధు ఘనత సాధించింది. ఆమెతో స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ ’బేస్ లైన్’ మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.
సింధు సంతకం చేసిన బెస్ట్ డీల్ ఇదేనని ’బేస్ లైన్’ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు తుహిన్ మిశ్రా తెలిపారు. ‘సింధుకు పెరుగుతున్న పాపులారిటీని వినియోగించుకునేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వచ్చే మూడేళ్లలో ఆమె బ్రాండ్ వేల్యూను అత్యధిస్థాయికి పెంచేందుకు ప్రయత్నిస్తాం. ఒలింపిక్స్ అద్భుత విజయం సాధించిన తర్వాత సింధు చూసిన అణకువ, విలువ ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్లింద’ని మిశ్రా అన్నారు.
ఇక నుంచి సింధు బ్రాండ్ ప్రొఫెలింగ్, లైసెన్సింగ్, ఎండార్స్ మెంట్స్ ను ‘బేస్ లైన్’ పర్యవేక్షించనుంది. సింధు తమ ఉత్పత్తులకు ప్రచారం చేయాలని ఇప్పటివరకు 16 కంపెనీలు సంప్రదించాయని మిశ్రా వెల్లడించారు. తొమ్మిది కంపెనీలతో ఒప్పందాలు దాదాపు ఖరారయ్యాయని తెలిపారు. వచ్చే వారంలో ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశముందన్నారు. కంపెనీలు పేర్లు ఇప్పుడు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. సింధు ప్రాక్టీసుకు భంగం కలగకుండా ఆమెతో వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారం చేయిస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more