రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశాన్ని మిస్ అయిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్.. కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నాడు. రెండు పర్యాయాలు భారత్ కు పతకాలను సాధించిన పెట్టిన ఈ రెజ్లర్ రియోలో పాల్గొనేందుకు భారత రెజ్లింగ్ అడ్డుకున్న నేపథ్యంలో.. ఇక తన కెరీర్ ను మరో మార్గంలో మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నాడు.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్యూడబ్యూఈ)తో ఒప్పందం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నాడు ఈ హర్యానా రెజ్లర్. ఈ మేరకు గత అక్టోబర్‌లో డబ్యూడబ్యూఈతో పూర్తిస్థాయి చర్చలు జరిపిన సుశీల్ కుమార్.. అందుకు తాజాగా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో డబ్యూడబ్యూఈ ఈవెంట్లలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తికనబరచని సుశీల్.. తనకు అదే సరైనదని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే డబ్యూడబ్యూతో మరొకసారి సంప్రదింపులు జరిపి తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది నవంబర్ లో డబ్యడబ్యూఈ ఈవెంట్లలో సుశీల్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే ది గ్రేట్ ఖలీ తరువాత వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లలో పాల్గొన్న రెండో భారత రెజ్లర్‌గా సుశీల్ నిలుస్తాడు. గతంలో రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు సాధించిన సుశీల్ కుమార్.. రియోకు వెళ్లేందుకు తనకే అర్హత ఉందంటూ భారత రెజ్లింగ్ సమాఖ్యతో పోరాడి ఓడిపోయాడు.
సాంకేతికంగా నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడంతో సుశీల్ దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనిపై సుశీల్ కడవరకూ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 30 నుంచి 40 వరకూ ఉన్న రెజ్లర్లను షార్ట్ లిస్ట్ చేసే పనిలో పడ్డ డబ్యూడబ్యూఈ.. భారత రెజ్లర్లపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. దీనిలో్ భాగంగా సుశీల్ కుమార్ పేరు ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more