Kidambi Srikanth reaches Australian Open semis సెమీస్ కు శ్రీకాంత్.. సింధూ, సాయిప్రణిత్ తిరుగుముఖం

Kidambi srikanth enters australia open s f sindhu loses to world no 1

Sai Praneeth, Kidambi Srikanth v Sai Praneeth, Kidambi Srikanth, Australian Open Super Series, Australian Open SS, PV sindhu, Tai Tzu Ying, Saina nehwal, sports, sports news, latest news

Kidambi Srikanth continued his brilliant run in the Australian Open Super Series and made it to the semi-final, PV Sindhu's exit from the tournament losing to world no 1 Tai Tzu Ying.

సెమీస్ కు శ్రీకాంత్.. సింధూ, సాయిప్రణిత్ తిరుగుముఖం

Posted: 06/23/2017 05:23 PM IST
Kidambi srikanth enters australia open s f sindhu loses to world no 1

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ మరో తెలుగువాడైన సాయి ప్రణిత్ ను ఓడించి సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లగా అటు ప్రపంచ నెంబర్ వన్ రాంకర్ తో జరిగిన పోరులో రియో ఒలంపిక్స్ రజత పతల విజేత పీవి సింధూ పరాజయం పాలైంది. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగం క్వార్టర్ ఫైనల్ లో ఇద్దరు తెలుగు క్రీడాకారుల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో కిదాంబి శ్రీకాంత్‌.. సాయి ప్రణీత్ లు క్వార్టర్ ఫైనల్ లో తలపడ్డారు.

ఇద్దరి మధ్య 43 నిమిషాల పాటు ఆసక్తికర పోరు సాగినా రెండు వరుస గేమ్ లను కిదాంబి శ్రీకాంత్ గెలుచుకున్నాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి గేమ్ ను 25-23 తో కిదాంబి సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో గేమ్ ను 21-17తో కైవసం చేసుకొని మ్యాచ్ విజేతగా నిలిచాడు. ఇండోనేసియా సూపర్‌ సిరీస్ లో అద్భుత ప్రదర్శనను కనబరిచి టైటిల్ గెలిచిన శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ లో కూడా అదే ఆటతీరును కనబరిచి సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లాడు.

ఇక మరోవైపు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో పీవీ సింధు పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ లో ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు.. చైనీస్‌ తైపీ క్రీడాకారిణి, ప్రపంచ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓటమి పాలైంది. సుమారు 61 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో పీవీ సింధు అద్భుత పోరాటం కనబరిచింది. తొలి గేమ్‌ను 21-10తో సునాయాసంగా గెలిచిన సింధు.. రెండో గేమ్ లో కొంత వెనకబడింది. 20-19తో ఆధిక్యాన్ని సంపాదించిన సింధు ఆ తర్వాత మూడు వరుస పాయింట్లు కోల్పోయి గేమ్ ను చేజార్చుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తై జు యింగ్‌ చక్కటి స్మాష్‌లతో పాయింట్లు రాబట్టింది. 21-16తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. దీంతో సింధూ తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australian Open  Sai Praneeth  Kidambi Srikanth  PV sindhu  Tai Tzu Ying  Saina nehwal  sports  

Other Articles