వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకుని బాడ్మింటన్ ర్యాంకింగ్‌లలో తన గత స్థాయిని తిరిగి రాబట్టుకున్న భారత బ్యాడ్మింటన్ సంచలనం కిదాంబి శ్రీకాంత్.. తాను బీడబ్యూఎప్ ర్యాంకింగ్‌లలో అత్యత్తమ పది స్థానాల్లోపు ర్యాంకు కలిగివుండటంతపై సంతోషంగా వుందన్నాడు. అయితే తాను ర్యాంకుల కోసం ఏమీ చేయనని, మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు. అస్ట్రేలియా సిరీస్ లోనూ గెలవాలన్న కాంక్షతోనే అడనని, అగస్టులో రానున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో కూడా తాను గెలుపుకోసమే అడతానని అన్నాడు.
అటు ఇండోనేషియా సూపర్ సిరీస్ లో.. ఇటు అస్ట్రేలియా సూపర్ సిరీస్ లో టైటిళ్లను కైవసం చేసుకుని ఇవాళ స్వరాష్రానికి తిరిగి వచ్చిన కిదాంబి శ్రీకాంత్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల నుండి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అటు నుంచి నేరుగా గోపిచంద్ అకాడమికి చేరుకున్న శ్రీకాంత్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గోన్నారు. తాను ఇంతగా రాటు తేలడానికి కారణం తన ప్రత్యర్థులేనని చెప్పుకోచ్చాడు. వారు తనను ఇరుకున పెట్టేందుకు కోట్టే షాట్లను ఎలా విజయాలుగా మలుచుకోవాలో అన్నది గ్రౌండ్ లోనే ప్రదర్శించి వారిని ఎదుర్కుంటున్నానన్నాడు.
తన విజయాల వెనుక తన కోచ్ ప్రమేయం కూడా ఎంతగానో వుందని శ్రీకాంత్ చెప్పారు. ఆయన పర్యవేక్షణలో నిర్వారామంగా ట్రైనింగ్ తీసుకోవడం వల్లే ఈ ఫలితం వచ్చిందన్నారు. గడిచిన రెండు వారాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. కేంద్ర క్రీడల శాఖ నుంచి కూడా తనకు మంచి సహకారం లభించిందన్నారు. గాయాల తర్వాత తనకు తానుగా పుంజుకున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. తనను ప్రోత్సహించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపాడు. తనతోపాటు ప్రణయ్ రాయ్, సాయి ప్రణీత్ కూడా బాగా రాణించారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more