బ్యాడ్మింటన్ రంగంలో భారత్ దూసుకెళ్తుంది. ఈ క్రిడలో భారత యువ సంచలనం లక్ష్యసేన్ తన సత్తా చాటాడు. 16 ఏళ్ల ఈ క్రీడాకారుడు అంతర్జాతీయంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా బల్గేరియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ లో టైటిల్ ను సాధించి సంచలనం సృష్టించాడు. అగ్రశ్రేణి క్రీడాకారులకు షాకిస్తూ ఫైనల్లోకి దూసుకెళ్లిన లక్ష్యసేన్ తుదిపోరులో ప్రపంచ రెండో సీడ్ క్రీడాకారుడికి షాకిచ్చి విజయాన్ని అందుకున్నాడు.
సుమారు 57 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో జీవోనిమిర్(క్రొయేషియా) తో తలపడిన లక్ష్యసేన్ 18-21, 21-12, 21-17తో విజయాన్ని అందుకున్నాడు. ఉత్తరాఖండ్ కి చెందిన లక్ష్యసేన్ తన 16వ జన్మదినాన్ని క్రితం రోజునే జరుపుకున్న ఈ యువ క్రీడాకారుడు.. తన జన్మదినం సందర్భంగా దేశానికే బహుమానాన్ని అందించాడు. కాగా అతనికి తోడుగా మాజీ జాతీయ ఛాంఫియన్ సయాలీ గోఖలే వున్నారని, అమె అతనితో ప్రయాణిస్తేూ.. అతడు ఎలాంటి ఒత్తడికి గురికాకుండా చూసుకుంటున్నారని లక్ష్యసేన్ కోచ్ విమల్ కుమార్ చెప్పారు.
ఇక రానున్న మరో ఆరు మాసాల్లో లక్ష్యసేస్ ఏయే టోర్నీలలో అడతారని మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన విమల్ కుమార్.. మరో రెండు నెల్లలో వియత్నాం గ్రాండ్ ఫ్రిక్స్ లో లక్ష్యసేన్ పాల్గోంటున్నాడని, ఆ రతువాత జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గోంటున్నాడని చెప్పారు. ప్రస్తుతం లక్ష్యసేన తన బలంతో పాటు మరిన్ని మెళకులతో ప్రత్యర్థులను చిత్త చేసేందుకు సిద్దం అవుతున్నాడని విమల్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో లక్ష్యసేన్ ఫైనల్ చేరుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more