Vimal blames scheduling for Saina's loss సైనా ఓటమికి అదే కారణం: కోచ్ విమల్ కుమార్

I would have loved a saina sindhu final says coach vimal kumar

pv sindhu, saina nehwal, vimal kumar, vimal kumar news, Nozomi Okuhara, saina nehwal vimal kumar coach, saina nehwal vimal kumar, world badminton champion ship sheduling, Nozomi Okuhara news, saina nehwal reaction on pv sindhu final, pv sindhu vs Nozomi Okuhara, Nozomi Okuhara, badminton, badminton news, latest sports news, sports news, latest news

Saina Nehwal's coach Vimal Kumar hits out at the organisers for poor scheduling, which hampered players' recovery time at the recently-concluded Glasgow meet.

సైనా ఓటమికి అదే కారణం: కోచ్ విమల్ కుమార్

Posted: 08/29/2017 09:08 PM IST
I would have loved a saina sindhu final says coach vimal kumar

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్ షిప్ లో సెమీస్ లో సైనా నెహ్వాల్ ఓటమికి కారణం షెడ్యూలింగ్ అని వాదన తెరపైకి వచ్చింది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌ షెడ్యూల్ సరిగ్గా చేసివుంటే కచ్చితంగా భారత అభిమానులు కోరుకున్నట్టు సైనా, సింధు ఫైనల్లో తలపడే అవకాశం ఉండేదని సైనా కోచ్ విమల్ కుమార్ అన్నారు. క్వార్టర్‌ ఫైనల్‌ ముగిసిన గంటల వ్యవధిలోనే సెమీస్ పోరులో పాల్గోనడంతో అలసటతో పాటు అమె ఆటతీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు.

అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్‌ తర్వాత సెమీస్‌కు సమాయత్తమయ్యేందుకు సైనాకు తగిన సమయం దొరకలేదని వాపోయాడు. సెమీస్‌లో ఓడిపోవడానికి చెత్త షెడ్యూలే కారణమని ఆరోపించాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌, ఒలింపిక్స్‌ లాంటి పెద్ద ఈవెంట్లలో అయినా కచ్చితమైన షెడ్యూల్ ఉండాలని కోరాడు. ‘సైనాకు ఇలా జరగడం దురదృష్టకరం. అర్ధరాత్రి వరకు క్వార్టర్ ఫైనల్ ఆడిన సైనా.. ఉదయాన్నే సెమీస్‌ లో తలపడాల్సి వచ్చింది.

తానైతే మొత్తం షెడ్యూలింగ్ లోనే లోపం ఉందని భావిస్తున్నానని పేర్కొన్నాడు. టీవీ ప్రసారాలు.. షెడ్యూల్ ను ప్రభావితం చేయకూడదని విమల్‌ స్పష్టం చేశాడు. ‘దీనికి పూర్తి బాధ్యత టెక్నికల్‌ అధికారులదే. రెండు మ్యాచ్‌ల మధ్య ప్లేయర్‌కు తగిన సమయం ఉండేలా చూడాల్సింది వారే. చెన్‌లాంగ్‌, శ్రీకాంత్‌ కూడా అర్ధరాత్రి మ్యాచ్‌లు ఆడి మళ్లీ ఉదయాన్నే బరిలోకి దిగాల్సి వచ్చింద’ని విమల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saina nehwal  vimal kumar  world badminton championship  pv sindhu  Nozomi Okuhara  badminton  

Other Articles