2024, 2028 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే నగరాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించిన నేపథ్యంలో పలు దేశాల క్రీడాకారులలో అందోళన వ్యక్తం అవుతోంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రభావం అధికంగా వున్న పారిస్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలు నిర్వహణ ఎందుకన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను స్వేచ్చగా చాటుకునే క్రమంలో ఉగ్రవాద భయం వారిని వెంటాడుతుందని అందోళన వ్యక్తం అవుతుంది.
ఇప్పటికే రెండు పర్యాయాలు ఐసిస్ ఉగ్రవాదులు పారిస్ నగరంపై విరుచుకుపడి మారణహోమం సృష్టించిన నేపథ్యంలో 2024లో పారిస్ లో అదే నగరాన్ని ఒలంపిక్స్ అతిథ్య నగరంగా ఎంపిక చేయడానికి గల కారణాలు ఏమిటన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. 2028లో లాస్ ఏంజెల్స్ లో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఒకేసారి రెండు ఒలింపిక్స్ కు ఆతిథ్య నగరాలను ఐఓసీ ప్రకటించడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. కాగా, పారిస్, లాస్ ఏంజెల్స్ కు గతంలో ఒలింపిక్స్ నిర్వహించిన అనుభవం ఉంది.
పారిస్ లో 1900, 1924 ఒలింపిక్స్, లాస్ ఏంజెల్స్ లో 1932, 1984లో నిర్వహించారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే, వందేళ్ల తర్వాత మళ్లీ పారిస్ లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇదిలా ఉండగా, 2024 ఒలింపిక్స్ కోసం పారిస్, లాస్ ఏంజెల్స్ తో పాటు మరో నాలుగు నగరాలు హాంబర్గ్, రోమ్, బుడాపెస్ట్, బోస్టన్ పోటీపడ్డాయి. రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల ఆ నాలుగు నగరాలు పోటీ నుంచి తప్పుకోగా, పారిస్, లాస్ ఏంజెల్స్ మాత్రమే మిగిలాయి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more