ప్రపంచ బ్యాడ్మింటన్ మనవాళ్లు చరిత్ర సృష్టించారు. అదేంటి అంటారా.. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో వరుసక్రమంలో అటు సైనా నెహ్వాల్, పీవీ సింధూ నుంచి కిదాంబి శ్రీకాంత్ సహా అందరూ ఇంటికి తిరుగుముఖం పట్టిన నేపథ్యంలో మనవాళ్లు అందులోనూ పురుషలు ఎలా చరిత్ర సృష్టించారో తెలుసుకోవాలని వుందా..? తాజాగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనూ మన క్రీడాకారులు సత్తా చాటారు.
బ్యాడ్మింటన్ చరిత్రలోనే తొలిసారిగా పురుషుల సింగిల్స్ విభాగం టాప్-20 జాబితాలో భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో కిదాంబి శ్రీకాంత్ 8వ స్థానంతో మన అటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. హెచ్ఎస్ ప్రణయ్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 15 ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే గతంలో 12వ ర్యాంకులో కొనసాగిన ప్రణయ్ తన ర్యాంకును కొల్పోయాడు. కొన్నాళ్ల క్రితం వరకు 19 వ ర్యాంకులో కోనసాగిన ఆయన తాజా ర్యాంకింగ్స్ లో మాత్రం 15వ ర్యాంకులో నిలిచాడు.
ఇక సాయి ప్రణీత్ 17వ స్థానంలో, సమీర్ వర్మ 19 స్థానంలో, అజయ్ జయరాం 20వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఈ ర్యాంకింగ్లపై స్పందించిన హెఛ్ఎస్ ప్రణాయ్.. ఇది అరంభం మాత్రమేనని వ్యాఖ్యానించాడు. మున్ముందు మన దేశ క్రీడాకారులు మరిన్ని విజయాలను అందుకుంటారని మరెన్నో అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక మహిళల సింగిల్స్ రాంకింగ్స్‌లో సింధు, సైనా స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. సింధు 2వ స్థానంలో.. సైనా 12వ స్థానంలో కొనసాగుతున్నారు.
Not very often we get to see this!! First time 5 Indians in top 20 of the World Rankings!! Just the start
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more