భారత స్పింటర్ హిమ దాస్ స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హిమ దాస్.. 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారత అథ్లెట్ ట్రాక్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందడం ఇదే తొలిసారి. అస్సాంకి చెందిన 18 ఏళ్ల హిమ దాస్ ఫైనల్లో 400మీ పరుగుని కేవలం 51.46 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఆమె తర్వాత స్థానంలో రొమేనియా అథ్లెట్ మిక్లో 52.07 సెకన్లతో రజతం గెలవగా.. అమెరికాకి చెందిన టేలర్ మన్సన్ 52.28 సెకన్లతో కాంస్యానికి పరిమితమైంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో 52.10 సెకన్లలో 400మీ పరుగును పూర్తి చేసిన హిమ దాస్.. మంగళవారం జరిగిన మొదటి రౌండ్లో 52.25 సెకన్లు తీసుకోవడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 400మీ పరుగుని 51.32 సెకన్లలో పూర్తి చేసిన హిమ దాస్ ఫైనల్లో ఆరోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
కాగా, హిమదాస్ అద్భుత ప్రతిభతో చరిత్రను సృష్టించిన నేపథ్యంలో అమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు కేంద్రమంత్రులు, మాజీ కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులు అమెకు అభినందనలు తెలిపారు. అసాధారణమైన ప్రతిభతో స్వర్ణపతకాన్ని అందుకున్న హిమపై అటు నెట్ జనులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more