చిన్ననాటి నుంచి తనకు ఆట మీద మక్కువతో చిచ్చరపిడుగులా చెలరేగిపోయిన తెలుగుతేజం బొడ్డా ప్రత్యూష తాజాగా తన ఖాతాలో మరో టైటిల్ ను దక్కించుకుంది. తాజాగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్ లో ఆమె మహిళా గ్రాండ్‌మాస్టర్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ లో వేదికగా జరిగిన జిబ్రాల్టర్ ఓపెన్ చెస్ టోర్నమెంటులో ప్రత్యూషకు మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్ నార్మ్ లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనతను అందుకున్న మూడో మహిళా క్రీడాకారణిగా ప్రత్యూష నిలిచింది.
ఇదివరకు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. ఆ తరువాత వారి కోవలోనే ఈ ఘనతను సాధించిన మూడో క్రీడాకారిణిగా ప్రత్యూష నిలిచింది. కాగా, ప్రత్యూష మూడేళ్ల క్రితమే తొలి రెండు నార్మ్ లను సాధించింది. తాజాగా జిబ్రాల్టర్ టోర్నీలో తొమ్మిది రౌండ్లలో 5 పాయింట్లు సంపాదించి మూడో నార్మ్ అందుకోవడం ద్వారా ఈ హోదా సాధించింది. అయితే భారత దేశవ్యాప్తంగా ఈ హోదాను అందుకున్న వారి సంఖ్య ఏడు. కాగా తాజా విజయంతో ఈ గ్రాండ్ మాస్టార్ టైటిల్ అందుకున్న ఎనిమిదో క్రీడాకారిణి ప్రత్యూష నిలిచింది.
ఇప్పటిదాకా ఎనిమిది జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలు గెలిచిన ప్రత్యూష.. జిబ్రాల్టర్ టోర్నీలో 25 పాయింట్లు సాధించి మొత్తం మీద ఎలో పాయింట్ల సంఖ్యను 2325కు పెంచుకుంది. గతేడాది జాతీయ సీనియర్ చెస్‌లో నాలుగో స్థానం సాధించిన ప్రత్యూష.. బీజింగ్ చెస్ టోర్నీలో అయిదో స్థానంలో నిలిచింది. ఇక భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అమెకు క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more