టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి చేరేలా ధీమాగా కనిపించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా.. సెమీస్ లో నిరాశపరిచినా.. దేశానికి మాత్రం కాంస్య పతకాన్ని అందించాడు. ఆది నుంచి రెజ్లింగ్ లో దూకుడుగా వ్యవహరించిన పునియా దేశానికి స్వర్ణం తీసుకోస్తాడని ఆశించిన భారతీయ అభిమానులు నిరాశకు గురికాకుండా కాంస్య పతకాన్ని సాధించిపెట్టాడు. ఫురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఇవాళ కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్బెకోవ్ పై 8-0తేడాతో విజయం సాధించాడు.
ప్రపంచ చాంపియన్ అజర్బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్లో భజరంగ్ 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. కాగా సెమీస్‌లో ఓడిన భజరంగ్ పట్టుదలతో కాంస్య పతక పోరులో గెలిచాడు. మోకాలి గాయం ఇబ్బంది పెట్టడంతో శుక్రవారం మ్యాచ్ లో రాణించలేకపోయాడని అతని తండ్రి వెల్లడించారు. గోల్డ్ మెడల్ సాధిస్తాడనుకున్న రవి దహియా ఫైనల్ లో ఓడిపోయాడు. అయినా రజతంతో మెరిశాడు. రెజ్లింగ్ 57 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైనల్ లో ఓడినా.. భారత్ కు రజతాన్ని అందించాడు. ఫైనల్ మ్యాచ్ లో రష్యాకి చెందిన జౌర్ ఉగేవ్ చేతిలో 4-7తో ఓడినా పతకం దక్కింది.
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more