‘రాధ-మధు’తో బుల్లితెరపై మొదటిసారి మెరిసింది. ‘లయ’తో ప్రేక్షకుల మనసులకు మరింత దగ్గరయ్యింది. ‘రక్తసంబంధం’లో అటు సాప్ట్ గా, ఇటు ఫాస్ట్ గా రెండు రకాల పాత్రల్లో నటించి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. ప్రస్తుతం అభిషేకం, కుంకుమరేఖ సీరియల్స్ ద్వారా ప్రతిరోజూ మన ఇంటికొచ్చి పలకరిస్తోన్న మౌనిక మనకు చెప్పిన మాటలివి.
మీ బ్యాగ్రౌండ్ గురించి...?
మాది హైదరాబాద్. నాన ్న, అమ్మ, అక్క, నేను... ఇదే మా ఫ్యామిలీ.
నటనపై ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పట్నుంచీ నటనంటే ఇష్టమే. ఎప్పటికయినా నటిని కావాలని ఆశపడేదాన్ని. డ్యాన్‌స అన్నా కూడా చాలా ఇష్టం. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్‌లో బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. మరి మీ ఆశ ఎప్పుడు తీరింది?
ఆసక్తి అయితే ఉందిగానీ అవకాశాల కోసం ఎలా ట్రై చేయాలో, ఎవరిని కలవాలో తెలియలేదు. ఓసారి ‘అతడు’ సినిమా కోసం జయభేరి ప్రొడక్షన్ వాళ్లు ఇచ్చిన యాడ్ చూసి అమ్మని అడిగితే సెలెక్షన్‌సకు తీసుకెళ్లింది. సెలెక్టవడంతో నా ఆశ తీరింది.
తొలిసారి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏమనిపించింది?
దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పటినుంచో ఉన్న కల. అది తీరినప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.
మరి సీరియల్స్‌కి ఎందుకొచ్చారు?
‘అతడు’ తర్వాత ‘స్టాలిన్’, ‘చుక్కల్లో చంద్రుడు’ లాంటి కొన్ని సినిమాల్లో చేశాను. వాటిలో నన్ను చూసి జస్ట్ యెల్లో డాట్‌కామ్ వాళ్లు రాధ-మధు కోసం అడిగారు. నేను వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకంటే సీరియల్స్ కాస్త మెచ్యూర్‌డగా కనిపించాలి. నేను ఇంకా చిన్నదాన్నే. చేయలేనేమోనని భయపడ్డాను. కానీ నిర్మాత ఊర్మిళ గంగరాజుగారు ధైర్యం చెప్పడంతో ఓకే అన్నాను.ఆ తరువాత...?
రాధ-మధు అయిపోతుండగానే ఊర్మిళ మేడమ్ ‘లయ’ కోసం నన్ను తీసుకున్నారు. అలవాటైన టీమే కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేకపోయింది.
ఇంతవరకూ చేసినవాటిలో తృప్తినిచ్చిన పాత్ర?
ఒకటి కాదు, రెండు ఉన్నాయి. మొదటిది ‘రాధ-మధు’. నాకో ప్రత్యేక గుర్తింపు నిచ్చిన సీరియల్ అది. తర్వాత ‘రక్త సంబంధం’. అందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. మొదట గుడ్డిదాన్ని. తర్వాత చూపొస్తుంది. అంతవరకూ చాలా సౌమ్యంగా ఉన్నదాన్ని ఒక్కసారిగా యాక్టివ్ అయిపోతాను. నన్ను బాధపెట్టిన వాళ్లను ముప్పుతిప్పలు పెడతాను. ఇన్ని షేడ్‌స ఉన్న పాత్ర దొరకడం చాలా అరుదు. దాన్ని చాలా ఎంజాయ్ చేశాను.
బయట కనిపిస్తే అభిమానుల స్పందన?
నేను సీరియల్స్‌లో ఒకలా ఉంటాను. బయట ఒకలా ఉంటాను. నన్ను బయట గుర్తు పట్టడం చాలా కష్టం. సీరియల్స్‌లో చీరల్లో కనిపిస్తాను. కానీ బయట మోడ్రన్‌గా ఉంటాను. కళ్లజోడు కూడా పెట్టుకుంటాను. దాంతో చాలామంది గుర్తుపట్టరు. ఎవరైనా గుర్తుపడితే వచ్చి పలకరిస్తారు. మీ సీరియల్స్ చూస్తున్నాను, మీ నటన చాలా బాగుంటుంది అని వాళ్లు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
కాంప్లిమెంట్స్ సరే. మరి కామెంట్స్...?
అవి కూడా వస్తుంటాయి. కొందరు మీరు అలా చేయడం బాలేదు, ఇలా చేయాల్సింది అంటుంటారు. నిజానికి మన నటన ఎలా ఉంది అనేది ప్రేక్షకులకి తెలిసినంతగా మనకు తెలీదు. వాళ్ల జడ్జిమెంటే ఎప్పుడూ కరెక్ట్‌గా ఉంటుంది. వాళ్లు చెప్పకపోతే మనం చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటాం. అందుకే విమర్శలకు ఎప్పుడూ బాధపడను. స్పోర్టివ్‌గా తీసుకుంటాను.
నచ్చక మధ్యలోవదిలేసిన పాత్రవుందా?
లేదు. నేనెప్పుడూ అలా చేయను. మనకు ఓ పాత్ర ఇచ్చారంటే, అది మనమీద వాళ్లకున్న నమ్మకం. దాన్ని నిలబెట్టుకోవాలి. పైగా బోలెడంత డబ్బు ఖర్చుపెట్టి తీస్తారు. నావల్ల ఎవరికీ ఏ నష్టమూ రాకూడదు. తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు?
నాకు వంట చేయడం చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్ వంటలు ట్రై చేస్తుంటాను. అందులోనూ చికెన్ అయితే అదరగొడతా! అలాగే టీవీలో రియాలిటీ షోలు కూడా చూస్తుంటాను.
మీ నటన పట్ల ఇంట్లోవాళ్ల స్పందన...?
అందరూ చాలా హ్యాపీ. ఏవైనా లోపాలున్నా చెబుతారు. ముఖ్యంగా అమ్మ! నేను అన్నిటికీ తనమీదే ఆధారపడతాను. నేనే సీరియల్లో నటించాలో కూడా అమ్మే డిసైడ్ చేస్తుంది.
మీలో ప్లస్/మైనస్ పాయింట్స్?
నేనెవరితోనూ త్వరగా కలవలేను. ఆచితూచి పదిసార్లు ఆలోచించి మాట్లాడతాను. అది నాలో మైనస్. అయితే ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాను. అదే నా ప్లస్ పాయింట్.భవిష్యత్ ప్రణాళికలేమిటి?కెరీర్ బాగుంది. కానీ ఓ కోరిక మిగిలిపోయింది. బీకామ్ అయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామనుకున్నాను కానీ బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. అది మాత్రం ఎప్పటికయినా చేసి తీరతాను.మంచి మంచి సీరియల్స్ చేశాను. నాకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాను. మంచి పాత్రలు దొరికితే మళ్లీ సినిమాల్లో చేయాల నుంది. క్లీన్‌గా, హోమ్లీగా ఉండే పాత్రలకే మొదట్నుంచీ మొగ్గు చూపుతున్నాను. మోడ్రన్‌గా ఉన్నా ఫరవాలేదు కానీ ఇబ్బందికరంగా ఉంటే మాత్రం చేయలేను, చేయను.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more