డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్.. ఆ తర్వాత నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అనంతరం కొన్నాళ్ళకే దర్శకుడిగా అవతారమెత్తి.. తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాదు.. రెండుమూడు సినిమాలకు పాటలు కూడా అందించాడు. ఇలా ఇండస్ట్రీలో వున్న అన్నీరంగాల్లోనూ రాణిస్తూ వచ్చిన లారెన్స్.. ‘రెబెల్’ సినిమాతో తన ఇమేజ్ ని దిగజార్చుకున్నాడు. ‘కాంచన’గా ఏ విధంగా అయితే అందరినీ భయపెట్టాడో.. ‘రెబెల్’తో అంతే నవ్వులపాలయ్యాడు. ఆ మూవీ ఫ్లాప్ అయిన నేపథ్యంలో కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు ఈ హీరో! అయితే.. ఆ సమస్యలన్నింటినీ ఎలాగోలా అధిగమించి.. తిరిగి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు లారెన్స్ సన్నద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం లారెన్స్ హీరోగా నటిస్తూ తన స్వీయదర్శకత్వంలో ‘కాంచన-2’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! ఇటీవలే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తమిళ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు సమాచారం! తమిళంలో ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలిసింది. త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన సెన్సార్ కూడా జరగనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకోసం లారెన్స్ ఎంతగానో కష్టపడ్డాడని, ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.
హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో వచ్చిన ‘కాంచన’ సినిమాను ‘కాంచన-2’ విడుదలకు సిద్ధమైంది. ‘ముని’ సినిమాకు సీక్వెల్‌గా ‘కాంచన’ తెరకెక్కగా, ఇప్పుడా సిరీస్‌లో మూడో సినిమా ఈ మూవీ వస్తోంది. మరి.. ఈ సినిమా లారెన్స్ కి సక్సెస్ తెచ్చి పెడుతుందో లేదో వేచి చూడాల్సిందే! ఇక ఈ సినిమాలో తాప్సీ, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా, బెల్లంకొండ్ సురేష్ నిర్మించారు.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more