ఏదైనా ఒక సినిమాలో మంచి పాత్రలో నటించే అవకాశం లభిస్తే చాలు.. ఎంతటి స్టార్ హీరోలైనా సరే ఆ పాత్రకోసం ఎంతకాలం వెచ్చించడానికైనా సిద్ధపడిపోతారు. ఎన్నో ప్రాజెక్టులను వదులుకుని, ఆ ఒక్క సినిమాకోసమే కసరత్తు చేయాల్సి వస్తుంది. ఇలాంటి పాత్రల్లో నటిస్తే జీవితంలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచిపోతాయని, ఆ పాత్ర తమకు మరింత పాపులారిటీని తెచ్చిపెడుతందని ఆశతో అందుకు సన్నద్ధమవుతారు. పైగా.. అలాంటి పాత్రలు నటజీవితంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తాయని తెలిసినప్పుడు మాత్రమే ఎక్కువ సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇలా తనకు ‘బాహుబలి’ విషయంలో అనిపించింది కాబట్టే, తాను మూడేళ్ళపాటు ఆ సినిమాకోసం వెచ్చించాడని రానా అంటున్నాడు.
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో రానా ‘భళ్లాదేవుడు’ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రకు తగిన విధంగా కనిపించడం కోసం తాను ఎంతో కసరత్తు చేశానని ఈ కండలవీరుడు చెప్పుడు. ఈ సినిమాలో తన పాత్రని రాజమౌళి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడని, ఆ విజువల్స్ చూసుకున్నప్పుడు తనకి ఎంతో సంతోషంగానూ, గర్వంగానూ అనిపించిందని చెప్పుకొచ్చాడు. తాను ఇంతకాలం పడిన కష్టానికి తగిన ఫలితం కనిపిస్తూ వుండటం వల్ల.. తాను మూడేళ్లు ఈ సినిమాకోసం వెచ్చించాననే ఆలోచన తనకెప్పుడూ రాలేదని రానా స్పష్టం చేశాడు. ఈ చిత్రం తనకి మరింత పాపులారిటీ తెచ్చిపెడుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇదిలావుండగా.. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైన విషయం విదితమే! ఈ ట్రైలర్ కి యావత్ ఇండియామొత్తం భారీ రెస్పాన్స్ దక్కింది. అంతేకాదు.. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఇంతవరకు ఏ తెలుగు చిత్రానికి దక్కని వ్యూస్ ‘బాహుబలి’కి దక్కాయి. దీనిని బట్టి చూస్తుంటే.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more