ప్రస్తుత జనరేషన్ కు అనుకూలంగా విలన్లను ఎంచుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా యాక్షన్ పరమైన చిత్రాల్లో యంగ్, డైనమిక్ పర్సనాలిటీ కల్గిన విలన్లను టాలీవుడ్ దర్శకనిర్మాతలు క్షుణ్ణంగా పరిశీలించి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే.. విలన్ ఎంత పవర్ ఫుల్ గా వుంటే అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం హీరోలకు దక్కుతుందన్న భావన! ఇప్పటికే అలాంటి పవర్ ఫుల్ విలన్లను కొందరిని ఇంపోర్ట్ చేయగా.. తాజాగా మరో తమిళ నటుడు తెలుగు ఇండస్ట్రీకి ఎనర్జటిక్ విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అదికూడా.. రాంచరణ్, శ్రీనువైట్ల కాంబోలో రాబోతున్న చిత్రంలో ఆ తమిళ నటుడకి ఛాన్స్ రావడంతో.. ఫిలింనగర్ లో అతడి గురించే చర్చించుకుంటున్నారు. ఆ నటుడు మరెవ్వరో కాదు.. తమిళ చిత్రాలతో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ కుమార్ తనయుడు అరుణ్ విజయ్.
రాంచరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! ఈ సినిమా కోసం చెర్రీ విదేశాల్లో పేరుగాంచిన స్టంట్స్ మాస్టర్స్ దగ్గర కొన్నాళ్లపాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫ్యామిలీ, ఎంటర్టైనింగ్ తోపాటు యాక్షన్ ఎక్కువగా వుండే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది కాబట్టి.. చెర్రీ అలా శిక్షణ తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇతనికి తగ్గట్టు పవర్ ఫుల్ గా వుండే విలన్ ని సెలక్ట్ చేయాలని యూనిట్ సభ్యులు భావించారు. ఈ క్రమంలోనే వీరికి తమిళ నటుడు అరుణ్ విజయ్ కంటపడ్డాడు. ఇటీవల అజిత్ హీరోగా వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ ప్రతినాయకుడిగా నటించిన అరుణ్.. తన నటనకు మంచి మార్కులే కొట్టేశాడు. ఆ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ కి చెర్రీ, అతని మూవీ యూనిట్ ఫిదా అవ్వడంతో అతడినే తమ సినిమాలో విలన్ గా అవకాశం కల్పించినట్లు సమాచారం. పైగా.. చెర్రీకి ధీటైన విలన్ గా అతడు సెట్ కావడంతో అతడినే ఫిక్స్ చేసుకున్నారట.
ప్రస్తుతం అరుణ్, చెర్రీలకు సంబంధించిన కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు శ్రీనువైట్ల చిత్రీకరిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో అరుణ్ కి తెలుగు ఇండస్ట్రీలోనూ ఓ ప్రత్యేక ఇమేజ్ లభిస్తుందని.. స్టార్ విలన్ల జాబితాలో చేరిపోతాడని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి.. ఈ చిత్రం అరుణ్ కి ఏ విధంగా తన కెరీర్ కి హెల్ప్ అవుతుందో వేచి చూడాల్సిందే!
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more