దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు..? అనే విషయమై గతకొన్నాళ్ల నుంచి నెలకొన్న కన్ఫ్యూజన్ తొలగిపోయింది. నిన్నటివరకు టాలీవుడ్ లో పవన్, మహేష్ లలో నెంబర్ వన్ స్థానం ఎవరిది అనే గట్టిపోటి వుండేది. అలాగే తమిళంలోనూ విజయ్, సూర్య, విక్రమ్, ఇంకా తదితర హీరోల్లో మొదటిస్థానం ఎవరిది అనే గొడవ అభిమానుల మధ్య జరుగుతుండేది.
తమ అభిమాన నటుడే మొదటి స్థానంలో వున్నాడని ఓ హీరో ఫ్యాన్ ప్రచారం చేసుకుంటే.. లేదు మా హీరో అంటూ మరికొందరు వాదనలు చేసుకునేవారు. ఈ వాదోపవాదనలను వినలేక అప్పుడప్పుడు ఓ సర్వే నిర్వహిస్తుంటారులెండి. ఇప్పుడు తాజాగా ఓ సర్వే నిర్వహించగా.. అందులో మొదటి స్థానంలో ఎవరు కొనసాగుతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
సౌత్ ఇండియా వైడ్ గా నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో హీరో ప్రభాస్ నిలిచాడని సమాచారం. ఆ తర్వాత రెండో స్థానంలో తమిళ నటుడు విజయ్ నిలిచాడు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని జరిపిన ఈ తాజా సర్వేలో ప్రభాస్, విజయ్ ల పేర్లు ముందువరుసలో కనిపించాయి. ఆ తర్వాత తక్కిన స్థానాల్లో మిగిలిన స్టార్ హీరోలు నిలిచారు.
ప్రభాస్ మొదటి స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. ఆయన నటించిన ‘బాహుబలి’ చిత్రమేనని స్పష్టంగా అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఆ చిత్రం దేశవ్యాప్తంగా విశేష స్పందనతో భారీ విజయం సాధించింది. అలాగే.. ప్రభాస్ కి మరింత అభిమానుల్ని తెచ్చిపెట్టింది. ఆ ప్రభావంతోనే ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచాడని తెలుస్తోంది. ఇక వరుస విజయాలతో (అదికూడా 100 కోట్ల క్లబ్లో చేరుతూ) విజయ్ దూసుకెళుతుండటం ఈ సర్వేపై ప్రభావం చూపించి వుండవచ్చునని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా.. ఈ సర్వేతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలెవరన్న విషయమై చిక్కుముడి విడిపోయింది.
AS
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more