తెలుగు చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. బావ మరదలి ప్రేమకథతో తెరకెక్కిన ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ యువహీరోకి ఒక్కసారిగా క్రేజ్ వచ్చి పడింది. ఆ తర్వాత ఇతనికి బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చినా.. సరైన కథ దొరకకపోవడంతో ఒప్పుకోలేదు. ఎన్నో కథలను విన్న అనంతరం ‘సినిమా చూపిస్త మావ’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. అది అన్ని చోట్లా మంచి టాక్ సంపాదించి హిట్ దిశగా దూసుకెళుతోంది. కలెక్షన్లు కూడా అనుకున్నదానికంటే ఎక్కువగానే వస్తున్నాయి. దీంతో ఈ యువహీరో ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. మొదటి చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టి, రెండో చిత్రంతో ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు ఆకర్షించాడు రాజ్ తరుణ్.
ఈ రెండో చిత్రం మంచి విజయం సాధించడంతో రాజ్ తరుణ్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ఈ సందర్భంగానే ఇతగాడు మాట్లాడుతూ.. తాము ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా, ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకోవడం హర్షనీయంగా వుందుంటూ పేర్కొన్నాడు. మొదట తాను హీరోగా చేసిన ఈ రెండో ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అన్న భయం ఉండేదని, సినిమా హిట్ కొట్టడంతో కొత్త ఎనర్జీ వచ్చిందని రాజ్ తెలిపాడు. ముఖ్యంగా మాస్ మహారాజ్ రవితేజ అందించిన కాంప్లిమెంట్ మర్చిపోలేనని, సొంత కష్టాన్ని నమ్ముకొని వచ్చిన రవితేజ అంటే ఎప్పట్నుంచో మంచి గౌరవం ఉండేదని, అలాంటి వ్యక్తి నుంచి కాంప్లిమెంట్ రావడమంటే అది అదృష్టమని ఈ కుర్రహీరో తెలిపాడు. ప్రస్తుతం ఈ హీరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నానని, అందులో ఒకటి సుకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న ‘కుమారి 21F’ అని రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more
Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more
Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more
Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more
Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more