ఉద్యోగం చేసే మహిళలు ఇటు ఆఫీసు, అటు ఇంటి కార్యకలాపాలను పూర్తిగా నిర్వహించుకోవాల్సి వుంటుంది కాబట్టి.. వారిలో శక్తిసామర్థ్యాలు క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఉదయాన్నే వుండే చురుకుదనం తగ్గుతూ.. సాయంత్రానికి ఎనర్జీ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతారు. దీంతో వారు నీరసించిపోయి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ఇదే సమయంలో మానసిక ఆందోళనలను, తీవ్ర తలనొప్పి వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అలాంటప్పుడు మహిళలు కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే చాలు.. వారిలో తగ్గిపోయిన ఎనర్జీ లెవెర్స్ తిరిగి పుంజుకుని.. చాలా చురుకుగా వుంటారు. మరి.. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..
* గుడ్లు : గుడ్లలో ప్రోటీనులు అధిక మోతాదులో పుష్కలంగా ఉంటాయి. మాంసాహారంలో ఉండే ప్రోటీనులు, బి విటమిన్స్, ఐరన్ కంటే గుడ్లలో అధిక స్థాయిలో వుంటాయి. ఇటువంటి గుడ్లను మహిళలు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే.. ఆ రోజంతా వారికి కావల్సిన ఎనర్జీని పొందగలరు.
* గ్రీన్ లీఫ్ : కాలె, పాలకూర, మెంతికూర వంటి వాటిలో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మహిళల ఎనర్జీకి చాలా అవసరం అయ్యే విటమిన్ ఎ, విటమిన్ సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా మహిళల్లో డిప్రెషన్ ను దూరం చేసే ఫ్లొల్లెట్ అనే కంటెంట్ కూడా ఈ కూరల్లో వుంటుంది.
* అరటి పండ్లు : అరటి పండ్లలో పొటాషియం, బి విటమిన్స్ అధిక మోతాదులో నిల్వవుంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను నిదానం చేయడంతోపాటు బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా వుంచుతాయి. కాబట్టి.. ఇటువంటి ఆహారాన్ని మహిళలు ప్రతిరోజూ తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని నిపుణుల సలహా.
* కొబ్బరి : ప్రతిరోజూ వంటకాల్లో కుకింగ్ ఆయిల్ కు బదులు కొబ్బరి నూనెను వాడటం ఎంతో మంచిది. ఎందుకంటే.. కొబ్బరి నూనెలో ఉండే మంచి కొవ్వులు ఎనర్జీగా మార్చబడుతాయి. రోజంతా ఎనర్జీతో ఉండటానికి, ఆకలి కలిగనియ్యకుండా ఎండటానికి అవి బాగా సహాయపడుతాయి.
* ఆపిల్స్ : ఆపిల్స్ లో ఫైబర్, విటమిన్ సి, యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా వుంటాయి. అవి ఎక్కువ ఎనర్జీని అంధిస్తాయి. వీటిలో ఇంకా ఫ్రక్టోస్ అనే అంశం ఉండే అతి త్వరగా శక్తిగా మార్పు చెందుతుంది. ఈ ఫ్రూట్ ని మహిళలు తమ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యంగా వుండొచ్చు.
కేవలం ఇవి మాత్రమే కాదు.. పుచ్చకాయ, గుమ్మడి, సాల్మన్ ఫిష్, అల్లం టీ, సిట్రస్ ఫండ్లు, నట్స్, బ్రాన్ ఫ్లేక్స్, క్వీనా, డార్క్ చాక్లెట్స్, పప్పులు, బ్రౌన్ రైస్, పెరుగు, లీన్ మీట్, నీళ్లు తదితరాలు మహిళల్లో ఎనర్జీ లెవెల్స్ ను పెంచడంలో దోహదపడుతాయి. ఈ విధమైన ఆహారాల్ని వర్కింగ్ ఉమెన్స్ ప్రతిరోజూ తీసుకుంటే వారిలో వ్యాధినిరోధక శక్తి పెరిగి.. నిత్యం చురుకుగా అన్ని కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more