శరీరాన్ని శుద్ధిచేయడం అంటే.. బరువు తగ్గించడం, టాక్సిన్స్ తొలగించడం, బ్లడ్ ప్రెజర్ తగ్గించడం, అనవసరమైన మలినాలను తొలగించడం, అధిక కొలెస్టిరాల్ శాతాన్ని తగ్గించడం.. మొదలైనవి. పై విధంగా పేర్కొనబడిన పనులను సమర్థవంతంగా పనిచేసేలా కొన్ని ఆరోగ్యకరమైన ఫుడ్స్ సహకరిస్తాయి. అంతేకాదు.. ఆ ఫుడ్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ మరియు కిడ్నీ స్టోన్స్ ను నివారించడంలో సహకరిస్తాయి. మరి.. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా..
* ఆపిల్ సైడర్ వెనిగర్ : ఒక కప్పు నీళ్ళలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకుంటే.. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అలాగే శరీరంలోని అదనపు సోడియంను బయటకు నివారించబడుతుంది. అంతేకాదు.. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి దీనిని చాలా సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది కిడ్నీలు, బ్లాడర్ కు సపోర్ట్ చేస్తుంది.
* సిలెంట్రో : జీర్ణక్రియను మెరుగుపరిచే ఫుడ్స్ లలో ఇది అన్నిటికంటే చాలా బెస్ట్. ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గించి.. శరీరాన్ని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే అద్భుతమైన ఫ్లేవర్స్ వల్ల దీనిని వంటకాల్లో విరిగా వాడుతారు. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
* క్రాన్ బెర్రీ జ్యూస్ : యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో హానికరమైన బ్యాక్టీరియాను తొలగించే కాంపౌండ్స్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు వ్యాధినిరోధకను పెంచే విటమిన్ సి అధికంగా ఉంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
పుచ్చకాయ : ఇందులో అధిక వాటర్ కంటెంట్ వుండటం వల్ల ఇది గొప్ప డ్యూరియాటిక్ ఫుడ్ గా పేర్కొనబడుతుంది. ఇది శరీరంను తేమగా వుంచడంతోపాటు మలినాలను బయటకు నెట్టివేస్తుంది. మెలోన్స్ లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ను కలిగి ఉండి, ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.
నిమ్మరసం : ఇది శరీరంలో పవర్ ఫుల్ డ్యూరియాటిక్ ఎఫొర్ట్ కలిగి ఉంటుంది. ఆ కారణం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తొలగిస్తుంది. అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు, బ్యాడ్ బ్యాక్టీరియా, ఇతర టాక్సిన్స్ ఉన్నప్పుడు.. ఒక గ్లాసు నిమ్మరసంను తీసుకోవడం వల్ల గ్రేట్ గా సహాయపడుతుంది.
వెల్లుల్లి : కొన్ని రకాల వెజిటేబుల్స్ ను తీసుకోవడం వల్ల పవర్ ఫుల్ డ్యూరియాటిక్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగలర్ లక్షణాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more