ఆధునిక యుగంలో ప్రతిఒక్కరు జంక్ ఫుడ్లకు అలవాటు పడటంతోపాటు వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. దానికి తోడు ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు వున్నాయి. ఒకానొక సందర్భంలో ప్రాణాలు పోవచ్చు. కాబట్టి... ఈ కొలెస్టిరాల్ శాతాన్ని వీలైనంత త్వరగా తగ్గించుకుంటే ఎంతో శ్రేయస్కరం. ఈ కొలెస్టిరాల్ శాతం త్వరగా తగ్గాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు తక్కువ క్యాలరీ ఉండే ఆహారం తీసుకుంటే చాలని ఆరోగ్య నిపుణులుఅంటున్నారు.
పళ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అవి.. కొలెస్టిరాల్ ని కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి.. ఆరోగ్యకరమైన పళ్లు, కూరగాయలు తీసుకుంటే ఎంతో మంచిది. ముఖ్యంగా తాజా కూరగాయలను ఉడకబెట్టి తింటే బరువు బాగా తగ్గుతారు. తాజా పళ్లు తిన్నా కూడా బరువు తగ్గుతారు. సలాడ్లు కూడా మంచివే. వాటిల్లో రుచి కోసం మిరియాల పొడి, ఉప్పు చల్లుకుని తినొచ్చు. సలాడ్లను స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. పళ్లు, కూరగాయల్లో సొల్యుబుల్, నాన్ సొల్యుబుల్ పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయడానికి మరికొన్ని చిట్కాలను అందజేస్తున్నారు. అవి ఏమిటంటే..
* ద్రాక్ష పళ్లు : ద్రాక్షలోని ముఖ్యమైన అంతోసైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్టరాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్షలోని పొటాసియం, శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం.
* మిరియాలు: నల్లమిరియాలు శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు బాగా తగ్గిస్తాయి. గుండెను వ్యాధులబారి పడకుండా రక్షిస్తాయి. వీటిలోని కాప్సిసిన్ పెయిన్ కిల్లర్‌గా ఉపయోగపడుతుంది.
* క్యారెట్: కొలెస్టరాల్ నిల్వలను తగ్గించడంలో క్యారెట్‌లోని బీటాకెరొటీన్ తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్యారెట్ తింటుంటే శరీరంలోని కొలెస్టరాల్ నిల్వలు పదిశాతం తగ్గుతాయి.
* పుట్టగొడుగులు : కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడంలో పుట్టగొడుగుల్లోని బి, సి, క్యాల్షియం విటమిన్లతోపాటు ఇతర మినరల్స్ బాగా పనిచేస్తాయి.
* ఓట్ మీల్ : దీనిలోని బీటాగ్లూకస్ అనే ప్రత్యేక పీచుపదార్థం స్పాంజివలే పనిచేసి కొలెస్టరాల్ ను గ్రహిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more