ప్రస్తుత ఆధునిక యుగంలో ఉద్యోగస్తులు నిత్యం కంప్యూటర్ ముందే కూర్చోవాల్సిన పరిస్థితి. కార్యాలయంలో బోలెడంత పని, ఇంటికి వచ్చిన తరువాత ఫ్రెండ్స్‌తో ఛాటింగ్.. అదేపనిగా కంప్యూటర్ ముందు గంటలతరబడి సమయం గడిపేయటం వంటి వాటిని నిత్యవసరాలుగా మార్చేసుకున్నారు. ఇంతేకాదు.. విశ్రాంతి పేరిట అనేక గంటలపాటు టీవీ ముందు కూర్చోవడం కూడా! ఇలా చేస్తూపోతే కొన్నాళ్లకు కళ్ల ఆరోగ్యం దెబ్బతిని.. కంటికి సంబంధించిన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన నిద్రలేని కారణంగా కళ్లకింద నల్లటి చారలు, కంటిచూపు మందగించటం, కళ్లలో మంటలు, కళ్లలోంచి నీరు కారటం.. వంటివన్నీ క్రమంగా ఒకదాని తరువాత ఒకటిగా వేధిస్తాయి. ఇలాంటి సమస్యల పాలవకుండా.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.
* ప్రతి రెండు గంటలకోసారి చేస్తున్న పనికి కాస్త బ్రేక్ ఇవ్వాలి. ఒకటి, రెండు నిమిషాలు కళ్లు మూసుకుని.. ఆ తరువాత చూపుడు వేలుని రెండు కళ్లమధ్య ఉంచి, కాసేపు తదేకంగా ఆ వేలుని చూడాలి. ఆపై వేలుని కళ్లకు మరీ దగ్గరగా, కాసేపు దూరంగా ఉంచి... కళ్లను పైకి, కిందకు, కుడి ఎడమలకు, గుండ్రంగా తిప్పుతూ చూడాలి. ఇది కళ్లకు చక్కటి వ్యాయామంగా పనిచేసి అలసటను దూరం చేస్తుంది. కంటిపై ఒత్తిడి తీవ్రమైతే గ్లూకోమా సమస్య వచ్చే అవకాశముంది. దానికి వ్యాయామమే విరుగుడు. అందుకే తేలిక పాటి వ్యాయామాన్ని ఎంచుకుని, క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించాలి.
* కళ్లను ఆరోగ్యంగా చూసుకోవాలంటే.. ఆహారపరంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో బీటా కెరొటీన్‌ను మించిన పదార్థం లేదు. ఇది కొన్నిరకాల పోషకాలను విటమిన్ ఎ-గా మార్చి, కళ్లకు ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతుంది. రేచీకటిని దూరం చేస్తుంది. కంటిచూపునూ మెరుగుపరుస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో క్యారెట్లు, ఆప్రికాట్లు, బొప్పాయి, మామిడి, పాలకూరలను ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకుంటే.. మిలమిలలాడే ఆరోగ్యకరమైన నయన సౌందర్యం సొంతమవుతుంది.
* మంచినీళ్లు తక్కువగా తాగితే కంటిపై ప్రభావం పడుతుంది. ఎక్కువ నీళ్లు తాగకపోతే శరీరంలో తేమ తగ్గుతుంది. కళ్లు జీవం కోల్పోయినట్లు కనిపిస్తాయి. కళ్లకింద ఉబ్బడం మొదలవుతుంది. అందువల్ల నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. చల్లగా ఉండే టీ బ్యాగులు, చల్లని పాలల్లో ముంచిన దూదిని అప్పుడప్పుడు కళ్లపై పెట్టుకోవడం మంచిది. నల్లగా మారి, ఉబ్బిన కళ్లకు ఇలాంటివి చక్కగా పనిచేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more