నిత్యం ఆరోగ్యంగా మెలగాలంటే.. రోజు జాగింగ్ చేస్తే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొలెస్టిరాల్.. చెమల రూపంలో బయటకు విసర్జన చేయబడుతుందని.. తద్వారా గుండె ఆరోగ్యంగా వుంటుందని అంటున్నారు. జాగింగ్ చేయడం వల్ల గుండెపై భారం పడుతుంది. దీనివల్ల గుండె మరింత ఆరోగ్యవంతంగా ఎక్కువకాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే.. జాగింగ్ చేసే సమయంలో గాలిని ఎక్కువగా పీల్చుకుంటాము. అలా గాలిని లోనికి ఎక్కువగా పీల్చుకోవడం వల్ల శరీరంలోని శక్తి వినయోగమవడమే కాదు.. అంతకుమించిన శక్తి ఉద్భవిస్తుంది.
నిజానికి జాగింగ్ చేసే అలవాటు లేనివారు పరుగెత్తాల్సి వచ్చినప్పుడు విపరీతమైన ఆయాసం వస్తుంది. అప్పుడు దాహం ఎక్కువగా వేయడంతోపాటు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో కాస్త రెస్ట్ తీసుకుని, తిరిగి మళ్ళీ జాగింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలా క్రమం తప్పకుండా జాగింగ్ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడమేకాదు.. పరుగెత్తినప్పుడు ఆయాసం రావడం వంటివి తగ్గుముఖం పడుతాయని వారు సూచిస్తున్నారు. జాగింగ్ అనేది శరీరాన్ని అలసట లేదా ఒత్తిడి తట్టుకుని నిలిచేలా చేయగలిగే ప్రక్రియగా చెబుతారు. జాగింగ్ను ఆరుబయట ప్రదేశాల్లో చేయడం వల్ల మనలోని మానసిక అలజడి తగ్గి, ప్రశాంతతను కలిగిస్తుంది. శరీరం కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటుంది. అందుకే.. రోజూ ఉదయాన్నే జాగింగ్ చేస్తే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జాగింగ్ చేయడానికి ప్రత్యేకమైన వస్తువులు, సౌకర్యాలు కూడా అవసరం లేదు. బాగా సౌకర్యవంతంగా ఉండే బూట్లను వేసుకుంటే చాలు. కాబట్టి మంచి షూ తీసుకుని, వాతావరణానికి అనుగుణంగా చెమటను పీల్చుకునేలా ఉండే బట్టలను వేసుకుని చక్కగా జాగింగ్ ప్రారంభించండి. మీ గుండెను పదిలం చేసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more