ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడితే..? ఇంకేముంది! అంతా అయిపోయింది. అంటూ చాలా మంది కంగారు పడతారు. అయితే నీటిలో ఫోన్ పడగానే కంగారు పడకుండా, ఎటువంటి ఆందోళన చెందకుండా కింద పేర్కొన్న విధంగా చేస్తే అధిక శాతం వరకు ఎలాంటి రిపేర్ చేయకుండానే డివైస్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
* నీటిలో పడ్డ ఫోన్‌ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు. ఫోన్‌పై ఉండే బటన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ చేయకూడదు.
* ఫోన్‌ను ఊపడం, విసరడం వంటివి చేయకూడదు. ఏం తెలియకుండా ఫోన్ పార్ట్స్‌ను విడదీయకూడదు.
* లోపల నీరు చేరిందేమోనని నోటితో గాలిని ఊదకూడదు. ఇలా చేస్తే నీరు డివైస్‌లోని సున్నితమైన ప్రదేశాల్లోకి వెళ్లి మరింత డ్యామేజ్‌కు గురి చేస్తుంది.
* ఏ పద్ధతిలోనూ ఫోన్‌ను హీట్ చేయకూడదు.
* నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్‌లోనే ఉంటే ఫోన్‌ను వెంటనే ఆఫ్ చేసేయాలి.
* ఫ్లిప్ కవర్/బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు, బ్యాటరీలను తీయాలి.
* పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు తుడవాలి. ఫోన్లో ఇతర ప్రదేశాలకు నీరు వెళ్లకుండా జాగ్రత్తగా పట్టుకుని ఈ పని చేయాలి.
* బయటికి రాని నీటిని వాక్యూమ్ సహాయంతో తీసేయాలి.
* కవర్ చేయబడి ఉన్న సంచిలోని బియ్యంలో ఫోన్‌ను పూర్తిగా కప్పాలి. ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా ఉంది. అందుకే ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది.
* ఒకటి లేదా రెండు రోజుల పాటు ఫోన్‌ను అలాగే ఉంచాలి. అనంతరం తీసి ఎప్పటిలాగే ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఫోన్ ఆన్ కాకపోతే ముందు చార్జింగ్ కానివ్వాలి. తర్వాత కూడా ఆన్ కానట్టయితే బ్యాటరీ మార్చి చూడవచ్చు. ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్‌కే తీసుకెళ్లడం మంచిది. అయితే ఫోన్ ఆన్ అయి ఉపయోగంలోకి వస్తే మాత్రం దాన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా పరిశీలించాలి. అందులోని హార్డ్‌వేర్ అంతా పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more