సాధారణంగా ప్రతిఒక్కరు తమతమ కార్యకలాపాలను ముగించుకున్న అనంతరం చాలా డల్ గా, అలసటగా ఫీల్ అవుతూ వుంటారు. ఆ సమయంలో మనలో ఉత్సాహాన్ని నింపే కొన్ని ఆహార పదార్థాలు అంటే.. చాక్లెట్లు, కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ తదితరవన్నీ తీసుకుంటే మంచిది కానీ అవి కేవలం తాత్కాలికం మాత్రమే! మరీ ఎక్కువ మోతాదులో తీసుకున్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు కొన్ని నియమాల ప్రకారం ఆహారాన్ని నిత్యం తీసుకుంటే చాలు.. ప్రతిరోజు చురుగ్గా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా మనసు ప్రశాంతంగా వుంటుంది. మరి ఆ చిట్కాలేంటే ఒకసారి మనం తెలుసుకుందాం...
నిత్యం అల్పాహారం తప్పనసరిగా తీసుకోవాలి : ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులతోపాటు ఆఫీసుకు వెళ్లే ఉద్యోగస్తులందరూ ఉదయంపూట అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) తీసుకోవడం మానేస్తారు. ఆకలి బాగా దంచుతున్నప్పటికీ సమయానికి ఆఫీసుకు చేరుకునే తొందరలో అల్పాహారం తీసుకోరు. ఇలా తీసుకోకపోవడం వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది. శరీరం చురుకుదనం కోల్పోతుంది. కాబట్టి ప్రతిరోజూ అల్పాహారం ఉదయాన్నే తీసుకుంటే చురుకుగా వుండటంతోపాటు లక్ష్యాలను కూడా సాఫీగా ఛేదించుకోవచ్చు.
టీ - కాఫీ అలవాట్లు : ప్రతిఒక్కరికీ టీ లేదా కాఫీ తాగే అలవాటు ఖచ్చితంగా వుండే వుంటుంది. అటువంటివారి వీటిని రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచిదే! కానీ.. అధికంగా తీసుకుంటే మాత్రం అలసటకు గురవుతారు. ముఖ్యంగా సాయంత్రం వేళ ఒక గ్లాసు కంటే ఎక్కువగా తీసుకుంటే నిద్రపట్టకుండా ఎక్కువసేపు మేల్కోవాల్సి వస్తుంది. కాబట్టి నిర్ణీత సమయాల్లో రోజుకు రెండుసార్లు తాగితే బాగుంటుంది. లేకపోతే తీవ్రపరిణామాలను ఎదుర్కోవలి వస్తుంది.
పిండి పదార్థాలు : అసలు అలసటకు గురికాకూడదనుకుంటే దంపుడు బియ్యం, పప్పులు, పాలకూర బత్తాయి వంటి పొట్టుతీయని ధాన్యాలు, పీచుతో కూడిన పదార్థాలు తీసుకుంటే చాలా మేలు. ఎందుకంటే ఇవి ఎక్కువ శక్తిని కలిగి వుండటంతోపాటు మానవ శరీరాన్ని చురుగ్గా వుంచడంలో ప్రధానపాత్రను పోషిస్తాయి. అలాకాకుండా చాక్లెట్లు, తియ్యటి పదార్థాలు తీసుకుంటే మాత్రం అలసటకు గురవ్వడమే కాకుండా.. ఒత్తిళ్లకు గురవ్వాల్సి వస్తుంది.
ప్రోటీన్లు వున్న ఆహార పదార్థాలు : ప్రోటీన్లు ఎక్కువగా వుండే ఆహార పదార్థాలను పిండి పదార్థాలతో కలిపి తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే.. ప్రోటీన్లు ఆలస్యంగా జీర్ణమవుతాయి. వీటిని కలిపి తీసుకున్నప్పుడు రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. దీంతో త్వరగా అలసిపోకుండా ఎక్కువసేపు చురుగ్గా వుండటానికి వీలుగా వుంటుంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more