సాధారణంగా వైద్యులు మన శరీరంలో వున్న కొలెస్టిరాల్ మోతాదుని బట్టి.. ఆరోగ్యంగా వున్నామా? లేదా? అనేది బేరీజు వేసుకుని చెబుతారు. అంటే.. సరైన మోతాదులో కొలెస్టిరాల్ వుంటే వివిధ రకాలుగా అది శరీరంలో ఉపయోగించబడుతుంది. జీవక్రియలు కూడా సహజంగానే పనిచేస్తాయి. అలాకాకుండా ఎక్కువగా వుంటే మాత్రం అనారోగ్యానికి గురవుతాం. శరీరంలో జరిగే రక్తప్రసరణ ఆగిపోయే ప్రమాదముంటుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొలెస్టిరాల్ ఆయిల్ రూపంలో వుంటుంది. ఇది రక్తంలో కలిస్తే.. శరీరంలో రక్తప్రసరణ జరగడం చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా బరువు ఎక్కువగా వున్నవారిలోనే ఈ కొలెస్టిరాల్ శాతం అధికంగా వుంటుంది. అయితే.. ఈ కొలెస్టిరాల్ సమస్య నుంచి బయటపడాలంటే వైద్యసలహాలతోపాటు గ్రీన్ వెజిటేబుల్స్ ని తీసుకుంటే చాలావరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఈ వెజిటేబుల్స్ లో వుండే రసాయనాలు, ఐరన్, పోషక పదార్థాలు నిత్యం ఆరోగ్యంగా వుండేందుకు చాలా సహాయపడుతాయి.
కొలెస్టిరాల్ ను తగ్గించే నేచురల్ గ్రీన్ వెజిటేబుల్స్ :
1. కీరదోసకాయ... ఇది ఒక ఉత్తమమైన గ్రీన్ వెజిటేబుల్. దీనిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో వుండే వేడిని బయటకు పంపివేసి.. చల్లగా వుండేందుకు సహాయపడుతుంది. అలాగే శరీరంలో అనవసరంగా కూరుకుపోయిన కొలెస్టిరాల్ ను తగ్గించడంలో ప్రముఖపాత్రను వహిస్తుంది.
2. బెండకాయ... ఇందులో అధిక మోతాదులో ఫైబర్ వుంటుంది. ఇది మన శరీరంలో వుండే వేస్ట్ కొలెస్టిరాల్ ను తగ్గించి.. ఫిట్ గా వుండేందుకు సహాయపడుతుంది. అలాగే హార్డ్ డిసీజ్ రిస్క్ లను కూడా తగ్గిస్తుంది.
3. ఉల్లిపాయలు... వీటిని పచ్చివి లేదా ఉడికించినవి తీసుకుంటే.. శరీరంలో అనేక ప్రోటీన్లు అందిస్తాయి. ఇవి శరీరంలో పెరిగే కొలిస్టిరాల్ తో పోరాడి.. దానిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
4. క్యారెట్స్... ఇందులో బీటా కెరోటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా వుంటుంది. ఇది శరీరంలో వుండే కొలెస్టిరాల్ ను తగ్గించి.. శరీరానికి అవసరమయ్యే కొవ్వు పదార్థాలను సరైన మోతాదులో వుంచుతుంది. వెజిటేబుల్స్ లో క్యారెట్ అన్నిటికంటే శ్రేష్టమైనది కూడా.
5. వంకాయలు... ఇందులో వుండే సోలబుల్ ఫైబర్.. శరీరంలో వుండే కొలెస్టిరాల్ శాతాన్ని తగ్గించడానికి చాలా సమాయపడుతాయి.
6. టమోటో... ఇందులో వుండే లైకోపిన్ పోషకం.. కొలెస్టిరాల్ ను శరీరంలో వ్యాపించకుండా చేస్తుంది. టమోటోను వండినప్పుడు ఈ లైకోపిన్ శాతం మరింత పెరుగుతుంది.
7. కాలీఫ్లవర్... కాలీఫ్లవర్ కొలెస్టిరాల్ ను తగ్గించడంలో ప్రముఖపాత్రను వహిస్తుంది. ఎందుకంటే.. ఇందులో వుండే స్టెరోల్స్.. కొలెస్టిరాల్ స్థాయిని తగ్గించి.. శరీరానికి అవసరమయ్యే కొవ్వును వుంచుతుంది.
8. ఆకుకూరలు (గ్రీన్ లీఫ్స్)... వీటిలో వుండే ల్యూటిన్.. శరీరంలో వుండే అధిక కొవ్వును తగ్గించి.. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే, నిత్యం ఆరోగ్యంగా వుండొచ్చు.
9. వెల్లుల్లి (గార్లిక్)... ఇందులో యాక్టివ్ సబ్ స్టాన్ గా పిలువబడే అల్లిసిన్ అనే కంటెంట్... శరీరంలో వుండే కొవ్వును తగ్గించి.. నేచురల్ గా వుంచుతుంది. అంతేకాదు.. ఏడిఎల్ లెవల్స్ ను తగ్గించి, బ్యాడ్ కొలెస్టిరాల్ ను తొలగిస్తుంది. పైగా శరీరానికి అవసరమయ్యే మంచి కొలెస్టిరాల్ ను ఇది అందిస్తుంది.
10. బీన్స్... ఇవి జీర్ణక్రియను వేగవంతం చేయడానికి చాలా దోహదపడుతాయి. వీటిలో వుండే హై ఫైబర్స్ కొలెస్టిరాల్, బరువును తగ్గించి, ఆరోగ్యంగా వుండేందుకు సహాయపడుతాయి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more