ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా (ఫేస్ బుక్, ట్విటర్, మైస్పేస్, స్కైప్, వాట్స్ యాప్) వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రైవేటు సంస్థల విషయాల గురించి అటుంచితే.. నేటి యువతరం అయితే ఈ సోషల్ మీడియా లేనిదే ఒక్క నిముషం కూడా వుండలేరనేది వాస్తవం! ఉదయాన్నే నిద్రలేచిన సమయం నుంచి రాత్రి నిద్రపోయే చివరిక్షణం దాకా ఏదో ఒక విషయాన్ని అప్ డేట్ చేస్తూనే వుంటారు. అంతేకాదు... తమ పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ ఫోటోలు, ఇంకా ఇతరత్ర వివరాలను సైతం అందులో పొందుపరుస్తారు. అయితే ఇలా తమ పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పొందుపరచడం ఏమాత్రం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇప్పటికే చాలామంది బలయ్యారు కూడా! కొంతమంది దుండగులు ఇతరుల పర్సనల్ డేటాను, వారి ఫోటోలను మార్ఫ్ చేయడం, ఇతర దురాచారాలకు పాల్పడి.. బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. మరి ఇటువంటి సమస్యలకు అస్సలు లోనవ్వకుండా తమతమ పర్సనల్ డేటాను చాలా గోప్యంగా వుంచుకోవాలంటే.. అందుకు కొన్ని జాగ్రత్తలను పాటించాలి. అవేమిటంటే...
1. సాధారణంగా కొంతమంది తమ ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువగా పెరిగిపోవాలనే ఆశాభావంతో ఎవర్నిపడితే వారిని యాడ్ చేసుకుంటారు. అవతలి వ్యక్తి ఎవరు, అతని వివరాలేంటివన్న విషయాలు చూసుకోకుండా యాడ్ చేసిపారేస్తారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు... అప్పుడే మన ప్రైవసీని కోల్పోయి, అనవసరమైన సమస్యల్ని కొనితెచ్చుకుంటాం. అలాకాకుండా.. ఎవరైతే ఫ్రెండ్స్ రిక్వెస్టులు పంపిస్తారో ముందుగా వారి విషయాలను పూర్తిగా చెక్ చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. అటువంటివారి జోలికి వెళ్లకుండా వుండటం ఎంతో శ్రేయస్కరం.
2. సోషల్ మీడియాలో పర్సనల్ డేటాతోపాటు ఫోటోలను అప్ లోడ్ చేయడం సహజం! అయితే అటువంటి విషయాలు సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా కాకుండా కేవలం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తదితరులకు తెలిసేలా సెట్టింగులు చేసుకోవాలి. అటువంటి సౌకర్యం సోషల్ మీడియాలో లభ్యమవుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ నెంబర్లు, పర్సనల్ అడ్రస్ వివరాలు ఇతరులతో అస్సలు పంచుకోకూడదు. మీకు నమ్మకంగా వున్నవారితోనే మీ ప్రైవసీని షేర్ చేసుకుంటే మంచిది.
3. కొంతమంది అపరిచితులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించకుండా వ్యక్తిగతంగా మెయిల్స్ పంపి, స్నేహం చేయడానికి ప్రయత్నిస్తారు. తనదైన పద్ధతిలో లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటి సమయాల్లో అతని మాట్లాడే వ్యవహారశైలిని, మీ విచక్షణనకు బట్టి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే కొత్తగా యాడ్ అయిన ఫ్రెండ్స్ తో కూడా ఛాట్ బాక్స్ లో ఫోన్ నెంబర్లు, పర్సన్ విషయాలు ఇచ్చి.. రిస్క్ లో పడకండి. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఏ వ్యక్తికి పర్సనల్ విషయాలు ఇవ్వకుండా వుంటే.. చాలావరకు మన ప్రైవసీని కాపాడుకున్నట్టే!
4. కొంతమంది ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ల ద్వారా ఆన్ లైన్ గేమ్స్ ఆడటానికి రిక్వెస్టులు పంపుతారు. ఒకవేళ మీకు ఆడాలని ఆసక్తి వుంటే.. అది అక్కడివరకు మాత్రమే పరిమితం చేయండి. అంతేగానీ.. మంచోడని భావించి అతనితో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే అంతే సంగతులు! అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమింటే.. ఫేస్ బుక్, ఈ-మెయిల్ పాస్ వర్డ్ ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కూడా అస్సలు పంచుకోకూడదు.
5. కొంతమంది అపరిచితులు పదేపదే మెయిల్స్ చేయడం లేదా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించడం చేస్తూ వుంటారు. అటువంటి వారి మెయిల్ ఐడీని సాధ్యమైనంతవరకు బ్లాక్ చేయడమే మంచిది. అలాగే ఎవరిమీదైనా అనుమానం కలిగితే.. వెంటనే అతని ఐడీని మీ ప్రొఫైల్ నుంచి డిలీట్ చేసేస్తే మంచిది. మరికొంతమంది టార్గెట్ చేసి, మిమ్మల్ని వేధించడానికి సోషల్ మీడియాను వాహకంగా ఉపయోగిస్తుంటారు. ఈ విషయాన్ని గనుక గమనిస్తే.. వెంటనే పోలీసులను ఆశ్రయించడం మంచిది. ఇటువంటి కేసులకోసం ప్రత్యేకంగా సైబర్ పోలీస్ విభాగం పనిచేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more