మానవుని ఆరోగ్యానికి బహుప్రయోజనాలు కలిగించే పోషక ఆహారాల్లోబ్లాక్ టీని కూడా పరిగణించవ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా తీసుకునే టీ రకాలలో ఇది ఎంతో ప్రత్యేకమైనదని, ఇందులో వుండే పోషక విలువలు ఎంతో ఆరోగ్యంగా వుంచుతాయని పరిశోధనల నిమిత్తం వారు పేర్కొంటున్నారు. బ్లాక్ టీతో కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
1. సమయానుకూలంగా ప్రతిరోజూ బ్లాక్ టీని తీసుకుంటే గుండె సమస్యల నుంచి చాలావరకు దూరంగా వుండవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇందులో ఎల్.డీ.ఎల్ కొలెస్టిరాల్ ఆక్సీకరణ కాకుండా నిరోధించే ఫ్లేవనాయిడ్స్ వంటి అనామ్లజనకాలు వుంటాయి. అలాగే రక్తప్రసరణ సమయంలో కలిగే అడ్డంకులను తొలగించడంతోపాటు ధమని గోడల నష్టాన్ని తగ్గిస్తుంది. ఎండోథెలియల్ వాసోమోటార్ పనిచేయకపోవటం వల్లవచ్చే కొరోనరీ ఆర్టరీ వ్యాధులు రాకుండా సహాయపడుతుంది. ఫ్లేవనాయిడ్స్ రక్తం గడ్డలు ఏర్పడకుండా ఉంచడంలో మరియు పరిహృదయ రక్తనాళాల వ్యాకోచము తగ్గించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి.
2. బ్లాక్ టీలో కనిపించే పాలిఫేనోల్స్ వంటి అనామ్లజనకాలు... పురీషనాళ, ప్రోస్టేట్, అండాశయ, ఊపిరితిత్తుల, మూత్రాశయం వంటి శక్తివంతమైన క్యాన్సర్ వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. బ్లాక్ టీ, రొమ్ము, ప్రొస్టేట్, కడుపు క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడుతుంది. TF-2 అనే మిశ్రమం ఈ టీలో ఉన్నందువలన క్యాన్సర్ కణాలను చంపేస్తుంది. బ్లాక్ టీ త్రాగటం వలన సిగరెట్ త్రాగేవారిలో లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను తీసుకునేవారిలో వొచ్చే నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
3. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల శరీరంలో ఎక్కువగా ఫ్రీరాడికల్స్ సంఖ్య పెరిగిపోతుందా. తద్వారా శరీరంలో క్యాన్సర్, ఎథెరోస్క్లెరోసిస్, రక్తం క్లాట్ ఏర్పడి చాలా హాని జరుగుతుంది. ఇటువంటి సమస్య నుంచి బయటపడాలంటే నిత్యం బ్లాక్ టీ తాగాల్సిందే. ఎందుకంటే.. ఇందులో ఎక్కువ మోతాదులో వుండే అనామ్లజనకాలు ఫ్రీ రాడికల్స్ ను తొలగించి విభిన్నమైన వ్యాధులబారి పడకుండా శరీర రక్షణకు సహాయపడుతున్నాయి.
4. బ్లాక్ టీలో ఉన్న టానిన్ పదార్థాలు ఇన్ఫ్లుఎంజా, జలుబు, ఫ్లూ, విరేచనాలు, హెపటైటిస్, ఇతర వైరస్ లను ఎదుర్కునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కేట్చిన్ అనే ఒక రకమైన టానిన్ కణితులను అణచివేయడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలో ఉన్న ఆల్క్య్లమిన్ జనకాలు వ్యాధినిరోధక స్పందనలను పెంచడానికి సహాయపడుతుంది. రోజుకు బ్లాక్ టీ 3-4 కప్పులు త్రాగితే ఒక రకమైన శోథలు, అలాగే హానికరమైన వ్యాధికారకాలను తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
5. బ్లాక్ టీ లో కెఫిన్ కంటెంట్ తక్కువ స్థాయిలో ఉండటం వల్ల మెదడుకు సాఫీగా రక్తసరఫరా జరగటానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలో ఉన్న ఎమైనో ఆమ్లం, L-తియానిన్ ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తుంది. రోజువారీగా నాలుగు కప్పుల బ్లాక్ టీ తీసుకుంటే.. కార్టిసాల్ హార్మోన్ వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. కెఫిన్ జ్ఞాపకశక్తి, మానసిక చురుకుదనం పెరాగడానికి సహాయపడుతుంది. ఇది పార్కిన్సన్ వ్యాధి నుండి కూడా రక్షిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more