నిజానికి మానవ శరీరానికి తెలియకుండానే ఎన్నోరోగాలు సోకుతూ వుంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి అనుకోకుండా మన శరీరం కొన్నిరోగాల బారిన పడుతూ వుంటుంది. అయితే మన శరీరంలో వుండే రోగనిరోధక శక్తి ఆ రోగాల నుంచి నిత్యం కాపాడుతూనే వుంటుంది. మానవ జీవనంలో అనునిత్యం జరిగే ప్రక్రియ ఇది. అయితే వాతావరణంలో వచ్చే మార్పుల ప్రభావాలు ఒక్కొసారి ఎక్కువైనప్పుడు రోగనిరోధక శక్తి దానిని తట్టుకోలేదు. అలాంటప్పుడు రకరకాల వ్యాధులు అంటే జలుబు, దగ్గు, జ్వరం, ఇంకా ఇతరత్ర రోగాలు వస్తాయి. మరి ఇటువంటి జబ్బుల బారినపడకుండా వుండాలంటే మనలో వుండే రోగనిరోధక శక్తి స్థాయిని నిత్యం పెంచుకోవాల్సి వుంటుంది. ఏవిధంగా అయితే ఆ శక్తిని పెంచుకుంటామో అదేవిధంగా రోగాలు మానవ శరీరం నుంచి దూరంగా జరుగుతాయి. మరి ఆ రోగనిరోధక శక్తి పెరుగుదలకు కావల్సిన పోషకాలు వెజిటెబుల్స్ లో పుష్కలంగా వుంటాయి. వాటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి సాయి పెరుగుతుంది. ఆ వెజిటెబుల్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం....
1. బ్రొకోలీ : ఇందులో జింక్, మెగ్నీషియంతోపాటు విటమిన్ బి12, బి6, సి వంటి న్యూట్రీషియన్ కాంపోనెంట్స్ పుష్కలంగా వుంటాయి. ఇది వ్యాధినిరోధకత పెంచడంలో కీలకపాత్రను పోషిస్తాయి.
2. గ్రీన్ లీఫ్స్ : ఇందులో శరీరానికి కావల్సిన అనేక విటమిన్స్, మినిరల్స్, యాంటీయాక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో లభ్యమవుతాయి. ఇవన్నీ వ్యాధినిరోధకతను పెంపొంధించడంలో అద్భుతంగా దోహదపడుతాయి.
3. ఆస్పరాగస్ : దీనిని ఒక హెల్తీ వెజిటెబుల్ గా వర్ణించుకోవచ్చు. ఎందుకంటే.. ఇందులో శరీరానికి ముఖ్యమైన న్యూట్రీషియన్స్, మినిరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే బ్రెయిన్ హెల్త్ కు కావాల్సిన మెగ్నీషియం కూడా పుష్కలంగా వుంటుంది.
4. బీట్ రూట్ : ఇందులో ‘‘లూటిన్’’ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువ మోతాదులో వుంటుంది. ఇది పెద్దవారిలో వ్యాధినిరోధకతను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. అలాగే కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా సమృద్ధిగా వుంటాయి. శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడంలో దోహదపడుతంది.
5. ఉల్లిపాయలు : మానవ శరీరానికి అవసరమయ్యే ఫైటోకెమికల్స్ పుష్కలంగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ నుండి రక్షిస్తాయి. అంతేకాదు.. యాంటీక్యాన్సర్ లక్షణాలు సమీద్ధిగా వుంటాయి.
6. కాలే : ఇందులో ఐరన్, విటిమన్ ఎ-సి ఎక్కువ మోతాదులో వుంటాయి. విటిమన్ ఎ శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. దీంతో శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా నాశనమవుతాయి. అలాగే విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది.
7. క్యారెట్ : శరీరంలో వ్యాధినిరోధకతను పెంపొంధించడానికి అవసరమయ్యే ఫైటో న్యూట్రియంట్స్ బీటాకెరోటిన్ పుష్కలంగా వుంటుంది. అది అనేక ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సెల్స్ ను అభివృద్ది చేస్తుంది.
8. ముల్లంగి : ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ చాలా తక్కువ మోతాదులో వుంటాయి. అంతేకాదు.. కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి6, ఫొల్లెట్ అధికంగా ఉండటం వల్ల ఇవి వివిధ రకాల జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయి.
9. క్యాబేజ్ : ఇందులో శరీరానికి ముఖ్యమైన న్యూట్రీషియంట్స్ విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా వుంటాయి. ఇవి ఆందోళన, డిప్రెషన్ తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. అలాగే ఇందులో యాంటీక్యాన్సర్ లక్షణాలున్నాయి.
10. బీన్స్ : ఇందులో ఫ్యాట్, కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
11. వెల్లుల్లి : వీటిలో అలిసిన్, అజోయేన్, థయోసల్ఫేట్ వంటి అంశాలు అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్ లను చంపుతాయి.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more