ప్రస్తుత పోటీ ప్రపంచంలో మెరుగ్గా జీవనం కొనసాగించాలంటే అందుకు చురుకైన మెదడు ఎంతో అవసరం! కేవలం ఒకే రంగంలోనే కాకుండా వివిధ విభాగాల్లో అనుభవం వుంటేనే సాఫీగా జీవనాన్ని గడిపేయొచ్చు. అయితే.. ముందుగా బ్రెయిన్’ను చురుగ్గా వుంచుకోవాలి. సాధారణంగా కొందరిలో మతిమరుపు అనే సమస్య అప్పుడప్పుడు వస్తూ వుంటుంది. ఒకటికి మించి ఇతర పనులు నిర్వర్తించడం వల్ల ఈ సమస్య మరింతగా పెరిగే ఆస్కారం వుంది. ఒక చోట చేయాల్సిన పనిని మరోచోట చేసేస్తారు.
అయితే.. ఈ సమస్య మరింత తీవ్రం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే.. మెదుడును చురుగ్గా వుంచుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకమైన శిక్షణలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మెదడును నిత్యంగా చురుగ్గా వుంచే కొన్ని ఆహారపదార్థాలు అందుబాటులో వున్నాయి. వాటిని నిరంతరం తీసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది. మరి.. అవేమిటో తెలుసుకుందామా...
కాఫీ : ఇందులో కెఫిన్ అనే పోషకపదార్థం వుంటుంది. మెదడును చురుగ్గా వుండటానికి బూస్ట్ వంటిదని అంటారు. అలా అని దీనిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ప్రతిరోజూ రెండు లేదా మూడు కప్పుల కాఫీ మాత్రమే తాగాలి.
చేపలు : వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా వుంటాయి. ఈ చేపలను రెగ్యులర్ డైట్’లో తీసుకుంటే.. బ్రెయిన్ పవర్ ఎంతో అభివృద్ధి చెందుతుంది.
గ్రీన్ లీఫ్ : మెదడుతోపాటు శరీరం మొత్త విస్తరించి వున్న రక్తనాళాలకు అవసరమయ్యే మెగ్రీషియం ఆకుకూరల్లో వుంటుంది. కాబట్టి.. వీటిని రెగ్యులర్ డైట్’లో తీసుకుంటే రక్తనాళాలతోపాటు బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది.
చాక్లెట్ : డార్క్ చాక్లెట్స్’లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుంటుంది. కాబట్టి.. వీటిని సమయానుకూలంగా తీసుకుంటే.. మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహాయపడుతాయి.
పెరుగు : చిక్కగా వుండే పెరుగులో క్యాల్షీయం పుష్కలంగా వుంటుంది. ఇది మెదడుకు సంబంధించిన అన్ని పనులను నిర్వర్తించడంతోబాటు మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
పుదీనా : ప్రతిరోజూ ఒక కప్పు పెప్పర్ మింట్ టీ తాగితే చాలు.. రోజంతా ఉల్లాసంగా, ఉత్తేజంగా వుండేలా అనిపిస్తుంది. అంటే.. మెదడు ఫ్రెష్’గా వుంటుందన్నమాట!
పసుపు : ఇది మెదడుకు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధులను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి.. వంటకాల్లో దీనిని వాడితే ఎంతో మంచిది.
టమాటో : ఇందులో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా వుంటుంది. ఇది మెదడు కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడంలో ప్రముఖపాత్రను పోషిస్తుంది.
అరటిపళ్లు : వీటిలో మ్యాంగనీస్ ఎక్కువ మోతాదులో వుంటుంది. ఇది మెదడు పెరుగుదల, బ్రెయిన్ ఫంక్షన్స్’కు చాలా అవసరం.
గుడ్లు : బ్రెయిన్ సెల్స్’కు హెచ్చరికలు అందజేసే పోషకాంశాలు వీటిల్లో పుష్కలంగా వుంటాయి. అంతేకాదు.. గుడ్డు పుష్కలమైన న్యూట్రిషన్ ఆహారం.
(And get your daily news straight to your inbox)
Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more
Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more
May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more
May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more
May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more