మార్చినెల మొదలు జూన్ చివరి వారం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు. తనలో దాగి వున్న ఉష్ణోగ్రత ప్రభావాన్ని ప్రజల మీదకు వెదజల్లుతాడు. ఎంతో ఆహ్లాదకరమైన శీతాకాలం హఠాత్తుగా మాయమయిపోయి... మండుటెండలు ఒక్కసారిగా వ్యాపించేస్తాయి.
సూర్యుని నుండి వెలువడే ఈ ఉష్ణోగ్రత వల్ల చర్మానికి సంబంధించిన అనేకరకాల వ్యాధులకు గురి చేస్తుంది. ముఖ్యంగా సూర్యుని నుండి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మానికి సంబంధించిన క్యాన్సర్ వంటి వ్యాధులను కలుగజేస్తాయి.
ముఖ్యంగా చర్మానికి సంబంధించిన వ్యాధులు ఆడవాళ్లలో చాలా తొందరగా వ్యాపిస్తాయి. వారి చర్మం మగవారికంటే చాలా సున్నితమైంది కాబట్టి.. చర్మం త్వరగా పొడిగా మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్లు తమ అందాన్ని కాపాడుకోవడానికి పడరానిపాట్లు పడుతుంటారు.
సూర్యరశ్మి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ముఖానికి స్కార్ఫ్ లు, గొడుగులు, కళ్లకు రంగురంగుల అద్దాలను ధరిస్తారు. చర్మానికి సంబంధించిన కరకాల లోషన్స్ ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా తమ ముఖాన్ని దుప్పటిలా కప్పుకున్నట్లు ఏమి కనబడకుండా కట్టుకుని పడేస్తారు.
అయితే చర్మరక్షణకు కావాల్సిన ప్రకృతి సిద్ధమైన పదార్థాలలో పెరుగు ఒకటి. సూర్మరశ్మి వల్ల చర్మంలో వుండే తేమ తొందరగా కరిగిపోయి, పొడిగా మారిపోవడం జరుగుతుంది. కానీ పెరుగు చర్మానికి నిరంతరం తేమను అందిస్తూ ఒక ఆయుధంలా పనిచేస్తుంది. అంతేకాదు... శరీర చర్మాన్ని ఆరోగ్యవంతంగా, చైతన్యంగా వుంచుతుంది.
పెరుగులో అందానికి సంబంధించిన అనేకరకాల బ్యూటీ టిప్స్ ని కలిగి వుంటుంది. పెరుగును ముఖానికి పట్టించుకోవడం వల్ల.. ముఖంపై వుండే పైప్ లైన్స్ మూసుకుపోతాయి. సూర్యునిరశ్మి వల్ల వచ్చే నల్లదనాన్ని తగ్గించి, ముఖంపై వుండే మొటిమలను తొలగించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. పెరుగును ప్రతిరోజు పట్టించుకోవడం వల్ల చర్మాన్ని ఫ్రెష్ (తాజా)గా, యవ్వనంగా వుండేలా చేస్తుంది. మరోవిధంగా చెప్పాలంటే... మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది.
ఇంకా పెరుగువల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను మనం తెలుసుకుందాం....
ఆఫీసు బయలుదేరిన సమయం నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేంతవరకు బయట వున్న వాతావరణ కాలుష్యం వల్ల, సూర్మరశ్మి వల్ల చర్మంలో పోషణ తగ్గిపోతుంది. దాంతో ఇది పొడిగా తయారవడం మొదలవుతుంది. అటువంటి సమయాల్లో పెరుగును ముఖంమీద అప్లై చేసుకుని శుభ్రమైన చల్లని నీటితో కడుక్కోవాలి. ముఖ్యంగా పెరుగులో వుండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని పొడిబారకుండా మృదువుగా వుంచడంలో తనదైన పాత్రను పోషిస్తుంది.
పెరుగుతో ప్రతిరోజు మసాజ్ చేసుకున్న తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ఇది చర్మరంధ్రాల ద్వారా చర్మానికి పోషణను కలిగిస్తుంది.
సూర్మరశ్మి వల్ల శరీరం నుండి నిరంతరం చెమట కారడం సహజం. అయితే ఆ చెమట వల్ల చర్మంపై దద్దర్లు రావడం, అవి వాపుగా తయారవడం జరుగుతుంది. అటువంటి సమయాల్లో పెరుగును పట్టించడం వల్ల అందులో వుండే జింక్ టాన్ వాటిని తొలగించడానికి ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది.
పుల్లగా వుండే పెరుగులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా వుంటాయి. ఇవి ముఖం మీద వున్న మొటిమలను తొలగించడంలో సహాయం చేస్తాయి.
ఆరెంజ్ తొక్క పౌడర్ ను పెరుగులో కలిసి... ఆ పేస్ట్ ను ముఖానికి నిరంతరం పూసుకోవడం వల్ల ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. దాంతో ఫెయిర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ లబిస్తుంది. అదేవిధంగా పెరుగులో కొంచెం తేనెను లేదా నిమ్మరసాన్ని కలుపుకోవడం ద్వారా చర్మం చాలా మృదువుగా, సాఫ్ట్ గా తయారవుతుంది.
పెసరపిండి, పెరుగుతో తయారుచేయబడిన ఒక పేస్ట్ ను ఫేస్ మాస్క్ లా ముఖానికి పట్టించుకుంటే.. చర్మం కాంతివంతంగా బంగారు ఛాయతో కనిపిస్తుంది. ఇది చర్మానికి ఎంతై చైతన్యం కలిగిస్తుంది.
ఈ విధంగా పెరుగుతో చర్మానికి ఎంతో మేలు చేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | వేసవికాలం వచ్చిందంటే చాలు... చాలామంది ఇంటి నుంచి బయటకు రావడమే మానేస్తారు. వేసవిలో భూమి, సూర్యునికి కొద్ది దగ్గరగా వెళతాడు. దాంతో సూర్యుని ప్రతాపం భూమి ఎక్కువ అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే కిరణాలు... Read more
May 14 | కళ్లు... మహిళల అందాలను మరింత ఆకర్షణీయంగా పెంపొందించడంలో ఎంతో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. సాధారణంగా మహిళలు తమ హావభావాలను కూడా ఈ కళ్ల ద్వారా వెల్లడిస్తారు. అమ్మాయిల అందం సాధ్యమైనంతవరకు కళ్ల మీదే ఆధారపడి... Read more
Apr 29 | రోజువారిగా నిర్వహించుకునే కార్యకలాపాలలో కొన్ని ప్రణాళికబద్ధమైన మార్పులను తెచ్చుకుంటే.. రోజంతా అందంగా, ఆనందంగా, ఆహ్లాదంగా గడపచ్చు. అదెలా అంటే... అందాన్ని పొందడం కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా.. ముఖంపై చిరునవ్వు లేకపోతే సహజ... Read more
Apr 24 | పెళ్లికానున్న ప్రతిఒక్క మహిళ తాను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటుంది. దానికి సంబంధించిన రకరకాల పద్ధతులను కూడా అవలంభించుకుంటారు. చర్మం నిగనిగలాడేందుకు, జుట్టు రాలకుండా వుండేందుకు, చేతులు మృదువుగా కనిపించేందుకు... ఇలా రకరకాలుగా... Read more
Apr 22 | సాధారణంగా కళ్లద్దాలను కంటిలోపం వున్నవారు, ఇన్ఫెక్షన్ వున్నవారు వాడుతారు. కానీ ప్రస్తుతకాలంలో కూడా ఈ కళ్లద్దాలను వాడటం ఒక ట్రెండ్ అయిపోయింది. అమ్మాయిలు అందంగా కనిపించడానికి రకరకాల కళ్లద్దాలు కూడా మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ఇవి... Read more