పిల్లలు పరీక్షల కోసం పుస్తకాలు, పెద్ద వాళ్ళు ఆఫీసులో ఫైళ్ళన్ని ముందే వేసుకొని గంటల తరబడి కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు కళ్ళు అలసిపోవడం, తలనొప్పి, కంటి సమస్యలు తలెత్తుతాయి. అలా జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.
- గదిలో లైటు కాంటి కాగితం మీద పడకుండా చూసుకోవాలి.
- లైటుకు కాస్తంత దూరంగా కూర్చోవాలి.
- పగటి పూట చదువుకునేటప్పుడు కిటికీలకూ దూరంగా కూర్చోవాలి.
- కిటికీ అద్దాల వెలుతురు కళ్ల మీద పడకుండా చూసుకోవాలి. ఆ కాంతి కళ్ళ మీద పడితే కళ్ళకు హాని చేస్తుంది.
- చదివేటప్పడు తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
- సూర్యకిరణాల వల్ల కళ్ళు బాగా అలసిపోతాయి. కాబట్టి నీడలో చదువుకోవడం మంచిది.
- కళ్ళు మంటగా అనిపించినప్పుడు మొత్తని వస్త్రాన్ని నీళ్ళలో ముంచి కళ్ళ మీద పెట్టుకోవాలి. ఫలితంగా కళ్ళు వాయకుండా ఉంటాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కళ్ళు అసలిపోకుండా ఉంటాయి.
- రోజుకు పదహారు గంటల పాటు చదివేవాళ్ళు వైద్యుల సలహా మేరకు కళ్ళద్దాలను వాడితే మంచిది.
(And get your daily news straight to your inbox)