ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు... ఇలా అనేక రకాలుగా ప్రతిఒక్కరు ప్రతిక్షణం ఆందోళన చెందుతూనే వుంటారు.
కుటుంబసభ్యులతో కలిసి వుండలేకపోతున్నారు. నలుగురిలో వున్నప్పుడు పైపైకి చిరునవ్వులు నవ్వుతారే తప్ప... మనసులో మాత్రం ఏదో తెలియని ఆవేదన బాధ కలిగిస్తూనే వుంటుంది. ఇటువంటి పరిస్థితులు అధికం అయినప్పుడు మానసిక స్థితిని కోల్పోయే ప్రమాదం వుంటుంది. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోవచ్చు.
ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి చాలామంది అనేక రకాల పద్ధతులను అనుసరించారు. మరికొంతమంది ఇంకా అనుసరిస్తూనే వున్నారు. అయితే తాజాగా వాస్తుశాస్త్ర నిపుణులు వీటికి తగిన పరిష్కారాలను మనముందు వుంచుతున్నారు.
ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మనలో ఏయే సమస్యలు వున్నాయి..? వాటికి తగిన పరిష్కారాలేమి..? అనే సమస్యలకు మొక్కలతో పరిష్కారం చూపిస్తున్నారు. ఈ మొక్కలు జీవితంలో వున్న సమస్యలను క్షణాల్లో తొలగించి.. సంతోషంగా గడిపేందుకు దోహదపడుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతన్నారు. అవేమిటో మనమొకసారి తెలుసుకుందాం....
మానసిక ప్రశాంతతను పొందడానికి సహకరించే మొక్కలు :
1. నందివర్థిని... ఇది మనసులో వున్న ఒత్తిడిని, ఆవేదనను బయటకు తరిమేసి.. మానసిక ప్రశాంతతను కలుగచేస్తుంది.
2. మందారం... మానసిక ఒత్తిడితో నిరుత్సాహ పరిస్థితిలో వున్నప్పుడు.. ఉత్సాహకరమైన శక్తిని పెంపొందించడానికి సహకరిస్తుంది.
3. తులసి... సాధారణంగా కొంతమంది తమలో వున్న ఒత్తిళ్లకు దూరం చేసుకోవడానికి దేవాలయాలకు సందర్శించుకుంటారు. అటువంటివారు తమ ఇంట్లోనే ‘‘తులసీ’’ మొక్కలకు పూజ చేసుకుంటే అది మానసిక ప్రశాంతతను కలిగించడంతోపాటు భక్తిని కూడా పెంపొందిస్తుంది.
4. మల్లి పువ్వు... కొంతమందికి రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో మరణానికి సంబంధించిన భయంకరమైన కళలు వస్తుంటాయి. అయితే ఈ మల్లిపువ్వు మొక్కలను, పూలను పెంచుకుంటే.. మనసులో వున్న మరణ భయాన్ని తొలగించి, మానసికంగా ప్రశాంతతను పెంచుతుంది.
5. రోజా మొక్క... ఈ మొక్కలను ఇంటి వాతావరణంలో పెంచుకోవడంతో కోరుకున్న ఉద్యోగాలు దొరుకుతారు.
6. ఆల్ మందా ఫ్లవర్... మనం నిర్వహించుకుంటున్న పనులు, శుభకార్యాలకు ఎటువంటి అడ్డంకులు రాకుండా తొలగిస్తుంది.
7. క్రోటాన్స్... ఇది మనలో వున్న చెడు ఆలోచనలను దూరం చేసి.. మంచి సుగుణాలను పెంపొందించడంలో సహాయపడుతుంది.
8. ఒపంటియా... ఇది ఆర్థికపరంగా వున్న నష్టాలను దూరం చేసి.. కీర్తి, సంపదలను పెంపొందించండలో సహాయపడుతుంది.
9. వైట్ గనేరా... మనసులో వున్న అన్ని బాధలను, దు:ఖాలను దూరం చేసి.. మనస్సును ప్రశాంతంగా వుంచడంలో సహకరిస్తుంది.
10. రెడ్ గనేరా... చేస్తున్న చిన్నచిన్న తప్పులను మనల్ని గ్రహించేలా చేసి.. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రేరేపిస్తుంది.
11. పేపర్ పువ్వు... ఇది కూడా తులసీ మొక్కలాగే మనసులో వున్న చెడుప్రభావాలను దూరం చేసి.. భగవంతుని మీద ఆదరణ, భక్తి కలిగించడానికి పూర్తిగా సహాయపడుతుంది.
ఇలా ఈ విధంగా రకరకాల మొక్కలు, రకరకాల సమస్యలను పరిష్కారం చేసి... మనలో వున్న మానసిక ఒత్తిళ్లను దూరం చేసి.. ప్రశాంతంగా, సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు దోహదపడుతాయి.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 24 | ప్రతిరోజూ నిర్వహించుకుంటున్న కార్యకలాపాలు, అధిక శ్రమ వల్ల ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో అటువంటివారికి రాత్రివేళ అంత తేలికగా నిద్రపట్టదు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉద్యోగస్తులు ఉన్నతిని పొందాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని... Read more