సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను సరిగ్గా పొందుపరుచుకోవడంలో విఫలం అవుతున్నారు. వీటివల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. ముఖ్యంగా సంతానం కలగకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులు, తరుచూ కుటుంబసభ్యుల మధ్య గొడవలు వంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఇంటిని నిర్మించుకునే ముందు సరిగ్గా లెక్క తే్ల్చుకుని వాస్తుప్రకారం సక్రమంగా కార్యక్రమాలను నిర్వహించుకుని, ఇంటిని నిర్మించుకోవాలి.
వాస్తుకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవడం ద్వారా కోరుకున్న కోరికలతోపాటు... కొన్ని అసాధారణమైన మంచి ఫలితాలు కలుగుతాయి. అందులో భాగంగా సంతానం లేని వారికి వాస్తుప్రకారం నిర్మించిన ఇంట్లో నివాసం ఏర్పరుచుకుంటే.. వారికి ఖచ్చితంగా పిల్లలు పుడతారని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. భారత ఆధ్యాత్మికవేత్త అయిన స్వామివివేకానంద కూడా వాస్తు గురించి మాట్లాడుతూ... ‘‘ప్రకృతిని మించిన గురువు లేడు’’ అని పేర్కొన్నారు. దీనిని క్లుప్తంగా పరిశీలిస్తే.. మన అలవాట్లు, ఆలోచనా విధానాలు మన చుట్టూ వున్న పంచభూతాల ప్రభావాల వల్ల నిత్యం మారుతుంటాయి. మనకు తెలియకుండానే వాటిని అనుగుణంగా మారిపోతుంటాం.
అదేవిధంగా వికృతంగా వున్న ప్రకృతి పరిసరాలలో (వాస్తుకు వ్యతిరేకంగా) గృహ సముదాయాలు కనుక వుంటే.. వాటి మధ్య సామాజిక సంఘర్షణలు, అనేక రకాల ఇబ్బందులు పుట్టుకొస్తాయి. ఒకరిమధ్య ఒకరికి సరైన సఖ్యత కుదరక అనేక వ్యతిరేక భావాలను ఎదుర్కోవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిళ్లను భరించాల్సి వస్తుంది.
తాజాగా జ్యోతిష్య నిపుణులు వాస్తు గురించి వెల్లడించిన అంశాలు ఏమిటంటే... వాస్తు ప్రకారం గృహాలను నిర్మించుకుంటే సంతానం కలుగుతుంది. ఉపకారాలు చేసే మహాత్ముడైనా, సంఘ విద్రోహక చర్యలకు పాల్పడే మనుష్యులైనా పురుడు పోసుకోవాల్సింది (జన్మించడం) ఏదో ఒక గృహంలో లేదా గూటిలోనే! పిల్లలు పుట్టిన వెంటనే అతని చుట్టూ వున్న పరిసరాల గుణాలు.. పెద్దయిన తరువాత అతని జీవితంపై ఖచ్చితంగా ప్రభావితం చూపుతాయి. ఆ నేపథ్యంలో వాస్తుప్రకారం ఉత్తమ ఇంటిని నిర్మించుకుంటే.. ఉత్తమమైన సంతానం కలుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more
Apr 24 | ప్రతిరోజూ నిర్వహించుకుంటున్న కార్యకలాపాలు, అధిక శ్రమ వల్ల ప్రతిఒక్కరు ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో అటువంటివారికి రాత్రివేళ అంత తేలికగా నిద్రపట్టదు. విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉద్యోగస్తులు ఉన్నతిని పొందాలని, వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని... Read more