భారతీయ వంటకాల్లో చాలా అరుదుగా వినియోగించే పదార్థాల్లో ‘నువ్వులు’ ఒకటి. వీటిని కేవలం పండుగల సమయాల్లో మాత్రమే ఎక్కువగా వాడుతారు. వీటితో తయారుచేసే ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా. ఎందుకంటే వీటి గింజల్లో 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లెవనాయిడ్ ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, డైటేరియన్ ఫైబర్ వంటివి పుష్కలంగా వుంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన ఈ నువ్వులు డయాబెటిస్, రొమటాయిడ్ ఆర్థ్రైటిస్, ఓరల్ హెల్త్, జలబు, చుండ్రు, చర్మ తదితర సమస్యలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగించే ఈ నువ్వులతో లడ్డూలు చేసుకుని తింటే ఎంతో శ్రేయస్కరం. మరి.. వాటిని ఎలా చేస్తారో తెలుసుకుందామా..
కావలసిన పదార్థాలు :
తెల్ల నువ్వులు - 1cup;
బెల్లం: 1/2cup;
ఖర్జూరం - 1 cup;
ఎండుకొబ్బరి తురుము- 1/4cup;
వేరుశెనగపప్పు - 1cup;
జీడిపప్పు - 1/2cup;
గసగసాలు - 2tbps;
ఎండుద్రాక్ష - 1/2cup;
యాలకులు - నాలుగు.
తయారు చేసే విధానం :
* ముందుగా స్టౌవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి కాగపెట్టాలి. నూనె వేగిన తర్వాత అందులో నువ్వులు వేసి దోరగా వేయించి విడిగా పెట్టుకోవాలి.
* ఏ విధంగా అయితే నువ్వులను దోరగా వేయించి పక్కన పెట్టుకున్నారో అలాగే వేరుశెనగపప్పు, గసగసాలు కూడా విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
* ఆ విధంగా వేయించిన ఆ మూడు పదార్థాలు చల్లారిన తర్వాత వాటిని మిక్సిలో వేసి పొడిగా చేసుకోవాలి. అలాగే యాలకలు, బెల్లం కూడా పొడి చేసుకోవాలి.
* ఇప్పుడు ఖర్జూరం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత ఖర్జూరం ముద్దలో నువ్వులు, గసగసాలు, పల్లీలతో చేసిన పొడి, కొబ్బరి తురుము, యాలకలపొడిని వేసి బాగా కల గలపాలి.
* అరగంట అలాగే ఉంచి ఉండలుగా చేసుకుంటే తియ్యనైన నువ్వుల లడ్డులు రెడీ.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more