మటన్ తో తయారుచేసే వివిధ రకాల కర్రీల్లో ‘పొటాటో మటన్ కర్రీ’ ఒకటి. స్పెషల్ ఆంధ్రా వంటకమైన ఈ ఫుడ్ ఎంతో స్పైసీగాను, రుచికరంగాను వుంటుంది. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో ఇష్టంగా తింటారు. మరి.. నోరూరించే ఈ రిసిపీని ఎలా చేస్తారో తెలుసకుందామా..
కావలసిన పదార్థాలు :
మటన్ : 1kg
బంగాళదుంప : 2 (పొట్టతీసి కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ : 3-4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
చెక్క : చిన్న ముక్క
యాలకులు : 4-5
బిర్యాని ఆకు : 2
పచ్చిమిర్చి : 4-5
పసుపు : 1/4tsp
ఉప్పు : రుచికి తగినంత
నూనె : 4tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
టమోటో : 4-5(గుజ్జులా తయారు చేసుకోవాలి)
కారం : 1tsp
ధనియా పౌడర్ : 11/2 tbsp
గరం మసాలా పౌడర్ : 1 1/2 tsp
తయారుచేసే విధానం :
* ముందుగా మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులో ఉల్లిపాయల ముక్కలు, మటన్ పీసెస్స్, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యాని ఆకులు, పచ్చి మిరపకాయలు, పసుపు, ఉప్పు, ఒక కప్పు నీళ్లు తదితరాలు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి.. 25-30 నిమిషాలపాటు ఆరు లేదా ఏడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
* మరోవైపు ఓ కడాయిని స్టౌవ్ మీద పెట్టి.. అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిమిషాలపాటు వేయించుకోవాలి. అనంతరం అందులో టమోటో గుజ్జ వేసి మళ్లీ కాసేపు వేయించాలి. ఇప్పుడు అందులోనే కారం, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా వేసి కొద్దిసేపటివరకు బాగా వేయించాలి. ఇలా ఉడికించినప్పుడు మసాలా అంతా వేగుతూ నూనె పైకి తేలుతుంది. ఇలా అయినప్పుడు అందులో ఇదివరకే పొట్టు తీసి కట్ చేసి పెట్టుకొన్న బంగాళదుంపను వేసి.. బాగా కలపాలి.
* ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న మటన్ మిశ్రమాన్ని ఆ కడాయిలోకి వంచుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మరో పది నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. నీళ్ళు కావాలనుకొంటే కొద్దిగా పోసుకొని బంగాళదుంప మెత్తగా అయ్యేంతవరకూ ఉడికించుకోవాలి. అందులోనే రుచికి తగినంత ఉప్పు, మరికొంచె గరం మసాలా, బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే.. పొటాటో మటన్ రిసిపీ రెడీ!
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more