Swiss watch with balaji image

Swiss watch with Lord Balaji image rakes up controversy

Swiss watch with Lord Balaji image rakes up controversy

Swiss watch with Balaji image.png

Posted: 02/22/2013 07:41 PM IST
Swiss watch with balaji image

ttd-watchతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామినే వ్యాపారానికి వాడుకుంటారా అంటూ టీటీడీపై, ప్రభుత్వంపై నగరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. నగరిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీవారు, ఆనందనిలయం ఫొటోలతో వాచీల తయారీకి స్విట్జర్లాండ్‌కు చెందిన సెంచురీస్ కంపెనీకి టీటీడీ అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. వీటిని రూ. 27 లక్షలతో లండన్‌లో వేలం వేయడం.. ఆ వాచీలను హైదరాబాద్‌లో టీటీడీ ఈవో ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. అసలు అన్యమతానికి చెందిన కంపెనీకి ఇలాంటి అనుమతి ఇవ్వడం శోచనీయమన్నారు. ఎమ్మార్ కుంభకోణంలో జైలుకు పోవాల్సిన టీటీడీ ఈవో సుబ్రహ్మణ్యం.. సీఎం తమ్ముడి అండతో టీటీడీని, హిందూ మతాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని ముద్దుకృష్ణమ ఆరోపించారు.ఈ వాచీల అనుమతులకు సంబంధించి సీఎంకు, దేవాదాయశాఖ మంత్రి, కార్యదర్శి, కనీసం టీటీడీ బోర్డు అనుమతైనా ఉందా అనేది చెప్పాలన్నారు. ఆదాయం కోసమే అయితే కొండపైనే ఇంకా ఎన్నో వ్యాపారాలకు టీటీడీ అనుమతులు ఇచ్చేయవచ్చని ఎద్దేవా చేశారు. ఇలాగైతే మరిన్ని కంపెనీలు కూడా టీటీడీతో వ్యాపారానికి ముందుకొస్తాయన్నారు. కాగా, దర్శనాలు, పాలనపరంగానూ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దర్శన టికెట్ల విషయంలో లిస్టు వన్, టూ, త్రీ అంటూ ప్రయోగాలు చేసి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Budget evokes mixed response in tirupati
High alert in tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles