ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు. భక్తిగా కళ్లకద్దుకుని కాస్తంత ప్రసాదం చేతికి తీసుకుని నోట్లో వేసుకున్నారు. అంతే... ఓ నట్టు పటుక్కుమని పంటి కిందకొచ్చి పడింది. ఇంతకు ముందు కూడా పాన్‌పరాగ్ పేపర్, ఇనుప రేకు వంటివి వచ్చినట్లు రామచంద్ర తెలిపారు. తిరుమల ప్రసాదమనగానే అందరూ ఎంతో భక్తితో స్వీకరిస్తారని, ఇలాంటి సంఘటనలు బాధాకరమని అన్నారు.
నెయ్యిలో అవకతవకలు.
స్వామి వారి లడ్డూల తయారీకి కావలసిన నెయ్యి కోసం టిటిడి టెండర్లను పిలిచింది. ఈ టెండర్ల ప్రక్రియలో తక్కువ కోట్ చేసిన ప్రీమియర్ అగ్రి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఈ నెయ్యి వ్యవహారంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలికి చెందిన ప్రీమియర్ అగ్రి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియాగాంధీ నియోజకవర్గంలో ఉంది. దీంతో ఢిల్లీలెవల్లో లాబీయింగ్ జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కర్నాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ లిమిటెడ్ సంస్థ టిటిడికి నెయ్యి సరఫరా చేసేది.
టెండర్ గడువు తీరిపోవడంతో నెయ్యి కొనుగోలుకు టిటిడి ఈ టెండర్లను ఆహ్వానించింది. టెండర్‌లో కేవలం రెండు కంపెనీలు మాత్రమే పాల్గొన్నాయి. వీటిల్లో రాయబరేలీకి చెందిన ప్రీమియర్ అగ్రి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కేజీ నెయ్యి ధరను 273లకు కోట్ చేసింది. ది కర్నాటక కోపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ లిమిటెడ్ సంస్థ 288 రూపాయలకు ధరను కోట్ చేసింది. దీంతో తక్కువ ధరకు కోట్ చేసిన రాయబరేలీ సంస్థకు టెండర్ ఖరారు చేశారు టిటిడి పెద్దలు. అంతేగాక ఏడాదికి ౩౩ లక్షల కేజీల నెయ్యి అవసరం కాగా, తొలి విడతగా నెలకు సరిపడే 12.63 కోట్ల రూపాయల విలువైన 4.5 లక్షల కేజీల నెయ్యిని ప్రీమియర్ అగ్రి ఫుడ్ నుండి కొనుగోలు చేయడానికి టిటిడి పాలకమండలి ఆమోదం తెలిపింది.
వ్యతిరేకించిన సభ్యులు
టిటిడి నిర్ణయాన్ని కొంతమంది పాలక మండలి సభ్యులే తీవ్రంగా వ్యతిరేకించారు. స్థానికంగా ఉన్న ఉపకార సంఘాల ద్వారా నెయ్యి సేకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇతర రాష్ట్రాల వారికి స్వామివారి డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పాలకమండలిలో చర్చించినా ఫలితం లేదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more
Nov 29 | పద్మావతి అమ్మవారికి కంఠాభరణం పద్మావతి అమ్మవారికి బంగారంతో తయారు చేసిన కంఠాభరణాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు రాత్రి బహూకరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కానుకను అందజేసినట్లు కనుమూరి తెలిపారు. ... Read more