Minister kotla plan for railway line to tirumala

plan for railway line to tirumala hill, kotla jaya surya prakash reddy, railway minister, plan for railway line to tirumala

minister kotla plan for railway line to tirumala

తిరుమలకొండకు రైలు మార్గం యోచన

Posted: 04/09/2013 06:38 PM IST
Minister kotla plan for railway line to tirumala

రుమల శ్రీవారి దర్శనార్థం నలుమూలలనుంచి వస్తున్న యాత్రికులను దృష్టిలో ఉంచుకుని తిరుమలకొండకు రైలుమార్గం గురించి ఆలోచిస్తున్నామని కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆయన శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు చేరుకుని తిరుమలలోనే బస చేశారు. ఉదయం నైవేధ్య విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో మంత్రికి టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి.సుబ్రమణ్యం సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా చైర్మన్‌, ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్‌ను ప్రపంచ స్థాయిలో అభివృధ్ధి పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. రెండు రోజులలో టీటీడీ చైర్మన్‌, ఈవోలతో సమావేశమై ఏర్పాట్లను రూపొందించనున్నామన్నారు. ఇప్పటికే ఎక్స్‌లేటర్‌ ఏర్పాట్ల పనులు ప్రారంభించామని ఇతర పనులు కూడా ప్రారంభించి వేగవంతం చేయనున్నామన్నారు. భవిష్యత్తులో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్దిగా ఉండి దేశం, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles