Tirumala temple closed following lunar eclipse

tirumala temple closed following lunar eclipse, closure of temple, ttd temple closing, tirumala tirupati venkateswara temple, lunar eclipse

tirumala temple closed following lunar eclipse

శ్రీవారి ఆలయం మూసివేత

Posted: 04/26/2013 05:26 PM IST
Tirumala temple closed following lunar eclipse

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారాలను గురువారం సాయంత్రం 5 గంటలకు మూసివేశారు ఈ గ్రహణం గురువారం అర్దరాత్రి 1.22 గంటల నుంచి 1.55 గంటల వరకు వచ్చింది. దీంతో దాదాపు ఎనిమిది గంటల ముందే ఆలయ ద్వారాలను శాస్త్రోక్తంగా మూసివేసిన తర్వాత ఆలయం మూసివేశారు. ఆలయంవెలుపల తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు విలేకరులతో మాట్లాడుతూ ఆలయ పంచాంగ కర్తలు, ఆగమ పండితుల సూచనల మేరకు చంద్రగ్రహణ గడియలు ప్రారంభానికి మునుపే ఆలయ తలుపులు మూసివేసినట్లు ఆయన తెలిపారు. పది గంటల పాటు ఆలయ ద్వారాలకు తాళాలు వేసి శుక్రవారం వేకువజామున 2.30 గంటలకు తెరవనున్నారు.

అనంతరం ఆలయ శుద్ది, పుణ్యహవచనం లాంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం 3 గంటల నుంచి శ్రీవారి సేవలు ప్రారంభమవుతాయన్నారు. ముందుగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీవారి అభిషేక సేవను యదావిధిగా నిర్వహించనున్నామన్నారు. అదేవిధంగా ఉదయం ప్రముఖుల ప్రారంభ దర్శనం ఉంటుందని తెల్లవారుజామున 3 గంటల నుంచి వివిధ దర్శనాలకు చెందిన భక్తులను కంపార్టుమెంట్‌లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటల తర్వాత భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది నాయకస్వామివారి దేవాలయం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మూసివేశారు. శుక్రవారం ఉదయం వేకువజామున 4 గంటల అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles