No vip break darshan in evening till may end at tirumala temple

no vip break darshan in evening till may-end at tirumala temple, tirumala tirupati devasthanams, sri venkateswara temple, cancelled vip begining break darshan, ttd chairman kanumuri bapiraju

no vip break darshan in evening till may-end at tirumala temple

విఐపి బ్రేక్‌ దర్శనాలు రద్దు

Posted: 04/29/2013 06:10 PM IST
No vip break darshan in evening till may end at tirumala temple

నేటి నుంచి వేసవి సెలవులు ముగిసేంత వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం తప్ప మిగతా రోజులల్లో సాయంత్ర విఐపి బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టిటిడి చైర్మన్‌ కనుమూరి బాపిరాజు వెల్లడించారు. తిరుమలలోని టిటిడి కార్యనిర్వహణాధికారి క్యాంపు కార్యాలయంలో ఆయన ఈఓ ఎల్వీ సుబ్రమణ్యంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సం ఖ్య రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు.సాధారణ రోజుల్లో 60 వేలుగా ఉన్న భక్తుల సంఖ్య వేశవి సెలవుల నేపధ్యంలో ప్రతిరోజూ 80 వేల నుండి లక్షకు చేరుకుంటోందని వివరించారు.ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలకమండలి సభ్యుల తో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటునట్టు వెల్లడించారు.భక్తులు ఈ విషయాన్ని గమనించి ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles