Samaikyandhra movement effects in tirupati

samaikyandhra movement effects in tirupati, Samaikyandhra Movement, Samaikyandhra Agitations At Tirupati, Tirupati JAC, Brahmotsavam, Srivari Brahmotsavam in Tirupati, TTD Tirumala Srivari Brahmotsavam, Srivari Brahmotsavam Tirupati 2013, Tirumala Srivari Navaratri Brahmotsavam Schedule 2013

samaikyandhra movement effects in tirupati

ఉద్యమం వల్ల ఇబ్బంది టీటీడీ చర్యలు-హోరెత్తుతున్న నిరసనలు

Posted: 09/26/2013 07:32 PM IST
Samaikyandhra movement effects in tirupati

అక్టొబర్ 5 నుంచి 13 వరకు తిరుమలలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనంగా బస్సులు నడపనున్నట్లు టీటీటీ ఈవో ఎంజీ గోపాల్ తెలిపారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల ప్రయాణాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వుండేందుకు రోజూ 550 బస్సులను నడపనున్నట్లు చెప్పారు. తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకొనేందుకు రైల్వేస్టేషన్, బస్ స్టేషన్లలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవాల సమయంలో వాహన సేవలను లక్షన్నర మంది భక్తులు చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లడ్డూ తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. శ్రీవారి నిత్యకైంకర్యాలు సక్రమంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

హోరెత్తుతున్న నిరసనలు

రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ చిత్తూరు జిల్లా తిరుపతిలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఎస్వీయూ వద్ద కామర్స్ విభాగం అధ్యాపకులు రిలేదీక్షలో పాల్గొన్నారు. పశువైద్య విశ్వవిద్యాలయం సిబ్బంది ఆకులు శరీరానికి చుట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. సావ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్ష శిబిరం వద్ద బాల్ బ్యాడ్మింటన్ ఆడుతూ తిరుపతి జేఏసీ కన్వీనర్ డా. సుధారాణి నిరసన తెలిపారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles