తిరుపతి ప్రశాంత ఉద్యమం వివాదాల దిశగా పయనిస్తోంది. సమైక్య ఉద్యమ నేపథ్యంలో చేపడుతున్న వినూత్న నిరసనలు గతంలో ఎన్నడూలేని విదంగా పార్టీల నడుమ ప్రకంపనలు స్రుష్టించాయి. సరికొత్త వివాదాలకు తెరతీస్తున్నాయి. పోటా పోటీ కార్యక్రమాలు ఒక్కసారిగా ఉద్యమం పంథాను మార్చేశాయి. ఫలితంగా తిరుపతిలో తెదేపా, కాంగ్రెస్ పార్టీల మద్య ఒకింత ఉద్రిక్తతకు తెరలేచింది. ఉద్యమంలో నిరసనలు సహజమే అని ఎవరికివారు పైకి చెబుతున్నా.. అవికాస్తా ఆరని కుంపటిని రాజేస్తున్నాయి. శ్మశాన వాటికలో సోనియాకు సమాధి కట్టిన నేపథ్యంలో ప్రతిగా తెదేపా అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర, దహన సంస్కారాలు నిర్వహించారు. సోనియాకు సమాధి కట్టిన వ్యవహారంపై పోలీసులు పదిమంది తెదేపా నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాను అవమానించారంటూ కాంగ్రెస్ నాయకుడు రాంభూపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు అల్లరిపూరిత చర్యలు, అగౌరవపరచిన సెక్షన్ల కింద పది మంది తెదేపా నేతలపై తిరుపతిలో కేసుల నమోదయ్యాయి. మున్ముందు ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపున..రాష్ట్ర విభజన వద్దని..సమైక్యమే ముద్దంటూ చేపట్టిన ఉద్యమం సమైక్యవాదుల ఆగ్రహావేశాల నడుమ ఉద్ర్దుతంగా కొనసాగుతోంది. నిత్యం వినూత్న ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. వేర్పాటు వాదులపై కదం తొక్కుతున్నారు. ఆంద్రప్రదేశ్ ను కలిపే ఉంచాలని అడుగడుగునా సమైక్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
విభజనకారుకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరి బాటా .. మాటా ..లక్ష్యం అన్నీ ఒక్కటే సమైక్యవాదమే ఏపీఎన్జీఓల పోరాటానికి నేటి నుంచి వైద్యులు మేము సైతం అంటూ మరోసారి ఉద్యమ బాట పట్టనున్నారు. కేవలం అత్యవసరసేవలకు మాత్రమే పరిమితం కానున్నారు. మరో వైపు ఈ రోజు నుంచి మూడురోజుల పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి నిరాటంకంగా సాగనుంది.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more