పద్మావతి అమ్మవారికి కంఠాభరణం
పద్మావతి అమ్మవారికి బంగారంతో తయారు చేసిన కంఠాభరణాన్ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు రాత్రి బహూకరించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కానుకను అందజేసినట్లు కనుమూరి తెలిపారు.
సుమారు రూ.20లక్షల విలువైన దశావతారాల ప్రతిమలు కల్గిన ఈ కంఠాభరణాన్ని ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ హారాన్ని వాహన సేవల్లో అలంకరించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
స్వామి పరిపూర్ణానంద
మతం ముసుగులో హిందూ ధర్మాన్ని దెబ్బతీయడానికి పీఠాలను, మఠాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య కేసులో కంచి పీఠాధిపతి పెద్ద స్వామి, చిన్న స్వామిపైన కేసును న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమన్నారు. హిందూజాతిని నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని, హిందూ ధర్మానికి ప్రభుత్వాల నుంచి రక్షణ కొరవడటంతో దాడులు చేస్తున్నారని కాకినాడ శ్రీపీఠానికి చెందిన స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు.
చిత్తూరు జిల్లాలో ఇటీవలి కాలంలో ఉగ్రవాద కదలికలు ఎక్కువయ్యాయని స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని.. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని స్వామి అన్నారు. తిరుపతికి వంద కిలో మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టకూడదని, అన్యమతస్తుల చిహ్నాలుగానీ, మందిరాలుగానీ ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తిరుపతిని హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో కాకుండా మరో చోట కట్టుకోవాలన్నారు. వకుళ మాత ఆలయ నిర్మాణానికి టీటీడీ ముందుకు రాకుంటే తామే చేపడతామన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more