మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ధిక సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా, ఉన్నారని ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల జీతభత్యాలను విజయవాడ, విశాఖపట్నం కార్పోరేషన్లలో విద్యాశాఖ ద్వారా గ్రాంటు ఇన్ ఎయిడ్ పద్ధతిలో మంజూరు చేస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోందని అందువల్ల ఇతర ఉద్యోగులతో పాటు నేరుగా 010 పద్దు కింద చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఫైలు మున్సిపల్ శాఖ నుంచి తమకు వచ్చిన వెంటనే క్లియర్ చేస్తామని పేర్కోన్నారు.
అలాగే కార్పొరేషన్ ఉద్యోగస్తులకు నేరుగా జీతాలు చెల్లించడానికి కృషి చేస్తామన్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి కార్పోరేషన్లలో ఉద్యోగులకు కార్పోరేషన్ల ఆదాయాలు ఆశించిన స్ధాయిలో పెరగనందువల్ల అభివృద్ధి నిధులు లేకపోవడంతో పురపాలక శాఖ ద్వారా గ్రాంటు మంజూరు చేయడమా లేక నేరుగా జీతాలు ఇవ్వడమా అన్న విషయంపై త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఆర్ధిక పరిస్థితి సరిగా లేనందువల్ల స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more