ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ సీఎం ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్షాలు బుధవారం చేపట్టిన మన్యం బంద్కు మిశ్రమ స్పందన లభించింది. కొన్ని మండలాల్లో విజయవంతం కాగా, మరి కొన్ని మండలాల్లో పాక్షికంగా జరిగింది. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, పాడేరు, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో దుకాణాలను కొంత మంది స్వచ్ఛందంగా మూసివేశారు. పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. పాడేరు పట్టణంలో బంద్కు కొంత మంది వ్యాపారులు స్పందించారు. పాడేరులో సీఎం పర్యటనను అడ్డుకుంటామని వైఎస్సార్ సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, గిరిజన సంఘం, బీజేపీ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు ముందుగానే హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం పర్యటనకు అడ్డంకి లేకుండా పోలీసులు ముందుగానే ఆయా పార్టీల నేతలను అరెస్టు చేసి పాడేరు పోలీసు స్టేషన్కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more