అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో లెహర్ తుఫాను కొనసాగుతోంది. అండమన్ తీరాన్ని దాటిన లెహర్ తుఫాను కోస్తాంధ్ర వైపు కదులుతుంది.
ఈరోజు రాత్రికి తీవ్ర పెనుతుఫాన్‌గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని, ఈ క్రమంలో కోస్తావైపుగా పయనించి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నానికి కళింగపట్నం-మచిలీపట్నంల మధ్య కాకినాడ సమీపాన తీరం దాటుతుందని పేర్కొంది. మచిలీపట్నం, కళింగపట్నం, మధ్య కాకినాడ దగ్గర పెను తుఫానుగా మారి తీరం దాటుతుందని అంచనా వేశారు. మత్స్యకారులను వాతావరణశాఖ అధికారులు అప్రమత్తం చేసింది.
విశాఖ తీరానికి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో లెహర్ తుపాను కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రికి పోర్టుబ్లెయిర్ వద్ద తీరాన్ని దాటి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించిన అనంతరం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ఇదిలావుండగా లెహర్ తుఫాన్‌పై కొంతమంది నిపుణులు ఒకింత భిన్నంగా విశ్లేషిస్తున్నారు. ఒక వాయుగుండం, తరువాత హెలెన్ తుఫాన్ సంభవించడంతో బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు లెహర్‌కు అంతగా అనుకూలించకపోవచ్చునని, అందువల్ల బలహీనపడే అవకాశం వుందని పేర్కొంటున్నారు. అయినా తీరం దాటే సమయంలో కోస్తాపై ప్రభావం వుంటుందని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more
Nov 15 | విశాఖజిల్లాలోని రంప చోడవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన సీఎం కిరణ్ రచ్చబండ కార్యక్రమానికి మంత్రి బాలరాజు హాజరు కాలేదు. రచ్చబండ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని మంత్రి బాలరాజును మీడియా ప్రశ్నించగా... తనకు సీఎం... Read more