చలికి కొండకోనలు గజగజలాడుతున్నాయి. తెరలు తెరలుగా కురుస్తున్న మంచుతో మన్యంలో పల్లెలు ముణగదీసుకుంటున్నాయి. ఎడాపెడా వీస్తున్న చలి గాలులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మొత్తం మీద శీతాకాలం ఏజెన్సీమీద పంజా విసురుతోంది. శీతల గాలులతో నలుమూలల నుంచి దాడి చేస్తోంది. అవధుల్లేని చలి కారణంగా మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో మన్యం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం లంబసింగిలో 3.5 డిగ్రీలు, మినుములూరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.లంబసింగిలో చింతపల్లి కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లంబసింగిలో ఉష్ణోగ్రతను కొలిచే సాధనం లేదు. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలను కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. లంబసింగి శీతల ప్రాంతం కావడంతో చింతపల్లి కన్నా మరో 4 డిగ్రీలు తక్కువ నమోదైనట్లు చెప్పడం పూర్వం నుంచి అనవాయితీగా ఉంటోంది. మన్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల తర్వాత జన సంచారం బాగా తక్కువవుతోంది. రాత్రి 11 గంటలయ్యేసరికి మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడడం లేదు. సూర్యోదయం కూడా ఆలస్యమవుతోంది. ఎండ ఎక్కే వరకు జనం ఇళ్లల్లోనుంచి రాలేకపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more