విశాఖ నుంచి బయలు దేరే రైళ్ళను భువనేశ్వర్‌కు తరలించుకుపోయినా నోరెత్తని చేతగాని ప్రజా ప్రతినిధులు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. విశాఖ ఎంపీగా ఉన్న పురంధేశ్వరికి స్వంత వ్యాపారాలు, తప్ప, విశాఖ వాసుల గోడు తప్పదని ప్రజా సమస్యలు పట్టవన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి అడపా దడపా నగరానికి వస్తూ హంగామా చేయడం తప్ప మరోకటి ఉండదన్నారు. వీరిద్ధరూ రానున్న 2014 లో విశాఖ పట్నం లోక్ సభ సీటు కోసం కొట్లాడుకోడానికే కాలాన్ని వెచ్చిస్తున్నారన్నారు. వీరికి విమాన ప్రయాణీకులు అవసరాలు తప్ప మరో ధ్యాస లేదన్నారు. విశాఖ నగరంలో కోట్లాది రూపాయలతో వ్యాపారం చేసే ధనికులే కాక, సామాన్యులు కూడా జీవిస్తున్నారని, వీరి అవసరాలు తీర్చవలసిన భాద్యత వీరిపై ఉందన్నారు. ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న భారతీయ రైల్వే సంస్ధ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలను విస్మరించి, పరిశుభ్రం పేరిట కోట్లాది రూపాయలు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏటా 4800 కోట్ల రూపాయలు విశాఖపట్నం రైల్వే డివిజన్ నుంచి వసూలు చేస్తున్న భారతీయ రైల్వే శాఖ కొత్తరైళ్ళను కేటాయించడం చేతగాని, దువ్వాడ నుంచి తరలిపోతున్న రైళ్ళను విశాఖకు మళ్ళించడం చేతగాని రైల్వే శాఖకు విశాఖ పట్నం ప్రయాణీకులపై జరిమానాలు విధించడం బాగా చేతనవునని సమైక్యాంధ్రా పొలిటికల్ సంయుక్త కార్యాచరణ సమితి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
విశాఖ ప్రాంత ప్రజా ప్రతినిధులు చేతగాని తనం కారణంగా రైల్వే ప్రయాణీకులు తీవ్ర నష్టాలను చవిచూస్తూ అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. ఇక విశాఖ రైల్వే ప్రయాణీకుల అవసరాలు ఏనాడో చెట్టాక్కాయనడానికి ప్రస్తుత పరిస్ధితులే నిరూపిస్తున్నాయి. సుమారు 12 రైళ్ళు విశాఖ కు రాకుండా దువ్వాడ మీదుగా మరలిపోతున్నా, అత్యధిక ఆదరణ, అవసరం ఉన్న రైళ్ళు భువనేశ్వర్‌కు తరలించుకుపోతున్నా ఈ చేతగాని ఎంపీలు నోరెత్తకపోవడం వల్ల విశాఖ ప్రాంత వాసులు కష్టాల పాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రైల్వే స్టేషన్లలో పరిశుభ్రత చేపట్టే కార్యక్రమంలో భాగంగా తూర్పు కోస్తా రైల్వే సంస్ధ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. విశాఖపట్నం వంటి అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్లలోని ఫ్లాట్ ఫారమ్‌లు, రైల్వే ట్రాక్‌లు, ఇతర రైల్వే పరిసరాల్లో ఉమ్మి , చెత్త వేసిన వారికి 500 రూపాయలు జరిమానా విధించేందుకు సిద్ధపడుతున్నారు.
ఇప్పటి వరకూ 100 రూపాయలు గా ఉన్న ఈ ఫైన్ ను త్వరలోనే 500 రూపాయలు జరిమానా పెంచనున్నట్టు తెలుస్తోంది. భారతీయ రైల్వే చట్టం 2012 ప్రకారం ఫ్లాట్‌ఫారమ్‌లపై ఉమ్మి వేసినా, చెత్త లేదా వినియోగించిన పదార్ధాలను విసిరినట్టయినా, మల మూత్రాలను విసర్జించినా కఠినంగా చర్యలు తీసుకునే అధికారం రైల్వే సిబ్బందికి ఉంది. దీనికై నిర్ణారించిన ప్రాంతాల్లోనే వీటిని వేయాలని తెలియచేస్తున్నారు అధికారులు. ఈ ఫైన్ ద్వారా 9,435 మంది నుంచి 6,21,400 రూపాయలు వసూలు చేసినట్టు ప్రకటించారు. విశాఖపట్నం వంటి ఏ1 రైల్వే స్టేషన్లలో ఈ పరిశుభ్ర చర్యలను కఠినంగా అమలు చేయాలని ఇటీవల రైల్వే బడ్జెట్ లో ప్రకటించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more